'మాజీ ప్రేయసికి రోడ్డుపైనే తాళి కట్టాడు' | Husband arrested after complaint lodge by wife | Sakshi
Sakshi News home page

'మాజీ ప్రేయసికి రోడ్డుపైనే తాళి కట్టాడు'

May 24 2014 8:51 AM | Updated on Aug 20 2018 4:27 PM

'మాజీ ప్రేయసికి రోడ్డుపైనే తాళి కట్టాడు' - Sakshi

'మాజీ ప్రేయసికి రోడ్డుపైనే తాళి కట్టాడు'

'ప్రేమే నేరమౌనా' అంటూ ప్రియురాలికి నడిరోడ్డుపైనే తాళి కట్టేశాడో వివాహితుడు.

హైదరాబాద్ : 'ప్రేమే నేరమౌనా' అంటూ ప్రియురాలికి నడిరోడ్డుపైనే  తాళి కట్టేశాడో వివాహితుడు. పెళ్ళయిన తర్వాత ప్రేమ నేరమే సుమా అంటూ పోలీసులు అతగాడిని కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే ముషీరాబాద్కు చెందిన విజయ్కుమార్ ఇంట్లో ఓ యువతి కుటుంబం రెండేళ్ల క్రితం అద్దెకి ఉండేవారు. ఆ సమయంలో విజయ్ కుమార్, ఆ యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దాంతో విజయ్ కుమార్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం పాప కూడా ఉంది. అయినా పాత ప్రేమను మరిచిపోలేకపోయాడు. శుక్రవారం మాజీ ప్రేయసి ఒక కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ఆమెకు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement