తిరుపతి, శ్రీనగర్లకు ఐఆర్సీటీసీ ఫ్లయిట్ ప్యాకేజీలు | irctc packages for tirumala and jammu kashmir | Sakshi
Sakshi News home page

తిరుపతి, శ్రీనగర్లకు ఐఆర్సీటీసీ ఫ్లయిట్ ప్యాకేజీలు

Published Thu, Jul 7 2016 7:20 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

irctc packages for tirumala and jammu kashmir

హైదరాబాద్ : పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా విమాన సర్వీసులను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఆ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీనగర్‌లకు వెళ్లే పర్యాటకుల కోసం తాజాగా రెండు ఫ్లయిట్ ప్యాకేజీలను ఆ సంస్థ గురువారం ప్రకటించింది. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని శీఘ్రదర్శనం ప్యాకేజీలో పేర్కొన్నారు.

ఈ పర్యటనలో హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో తీసుకెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించే సదుపాయం కల్పిస్తారని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెలలో రెండు దఫాలుగా అంటే 6, 27వ తేదీల్లో ఈ పర్యటన ఉంటుందని తెలిపింది. ఈ పర్యటన చార్జీ రూ.9,152 గా నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఈ పర్యటనలో భాగంగా కాణిపాకం దేవాలయం, శ్రీనివాస మండపం, తిరుమల హిల్స్, శ్రీ వెంకటేశ్వర శీఘ్రదర్శనం ఉంటాయని చెప్పింది. ఈ పర్యటనలో హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన సదుపాయంతో పాటు, ఒక రాత్రి ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తదితర సదుపాయాలన్నీ ఉంటాయి.

జమ్ము, శ్రీనగర్ పర్యటన...
ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ పర్యటన హైదరాబాద్ నుంచి ఆగస్టు 13వ తేదీన ప్రారంభమవుతుంది. శ్రీనగర్-గుల్మార్గ్ ,పహల్గామ్, సోన్‌మార్గ్, తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. ఒక గ్రూపులో 15 మంది పర్యాటకులు ఉంటారు. ఈ పర్యటన ప్యాకేజీ రూ.32,442 ఉంటుంది. శ్రీనగర్‌లో హౌస్‌బోట్, దాల్ సరస్సులో బోట్ రైడింగ్, శంకరాచార్య టెంపుల్ దర్శనం, మొఘల్ గార్డెన్స్ సందర్శన తదితర ప్రాంతాలు ఉంటాయి. హోటల్ వసతి, గైడ్, తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీని రూపొందించారు. వివరాలు, బుకింగ్ కోసం పర్యాటకులు ఫోన్ : 040-277012407, 040-23800580, 9701360647 నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement