షీర్‌కుర్మా.. బిర్యానీ.. ఖీర్! | Isis Hyderabad module Menu This | Sakshi
Sakshi News home page

షీర్‌కుర్మా.. బిర్యానీ.. ఖీర్!

Published Fri, Jul 8 2016 2:19 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

షీర్‌కుర్మా.. బిర్యానీ.. ఖీర్! - Sakshi

షీర్‌కుర్మా.. బిర్యానీ.. ఖీర్!

ఐసిస్ హైదరాబాద్ మాడ్యూల్ మెనూ ఇది
* ‘ఈద్’ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ
* కుటుంబీకుల్నీ కలిసే అవకాశం ఇచ్చిన అధికారులు
* యూసుఫ్ అల్ హింద్ ఎవరనే దానిపై దృష్టి
* ఇబ్రహీంలో కనిపించని పశ్చాత్తాప కోణం


సాక్షి, హైదరాబాద్: షీర్‌కుర్మా.. బిర్యానీ.. ఖీర్.. తమ కస్టడీలో ఉన్న ఐసిస్ అనుబంధ ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు ఈద్ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక మెనూ ఇదీ. ఈద్ సందర్భంగా కుటుంబీకుల్నీ కలిసే అవకాశం కూడా వారికి ఇచ్చారు.

ఎన్‌ఐఏ అధికారులు గత బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్నీ న్యాయస్థానం అనుమతితో 12 రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. విచారణలో నిందితులు పూర్తిగా సహకరిస్తున్న నేపథ్యంలో ఈద్ రోజైన గురువారం వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఎన్‌ఐఏ అధికారులు గురువారం విచారణకు తాత్కాలిక విరామం ఇచ్చారు. రంజాన్ నేపథ్యంలో నిందితులు కుటుంబీకుల్ని కలుస్తామని, ఇంటి భోజనం చేస్తామని అధికారుల్ని కోరారు.

కుటుంబీకుల్ని కలిసేందుకు అవకాశం కల్పించినప్పటికీ ఇంటి భోజనం చేసేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అయితే ఏం కావాలో చెప్తే అవి తామే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారి కోరిక మేరకు షీర్‌కుర్మా, బిర్యానీ, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ఖీర్ అందించారు. ఒక్కొక్కరి కుటుబం నుంచి ఇద్దరిని కలిసేందుకు అవకాశం ఇచ్చారు.
 
మాడ్యూల్ హ్యాండ్లర్ ఎవరనేది ఆరా..
ఈ నిందితులతో ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరిపిన హ్యాండ్లర్ ఎవరనేది నిర్థారించుకోవడంపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా చిక్కిన 30 మంది ఐసిస్ సానుభూతిపరులు, అనుమానితులు తమతో సం ప్రదింపులు జరిపిన వ్యక్తి యూసుఫ్ అల్ హిం ద్ పేరుతో పరిచయమయ్యారని, తామంతా అతడు షఫీ ఆర్మర్ అని భావించినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మాడ్యూల్ చీఫ్ ఇబ్రహీం సైతం తాను గడిచిన ఆరు నెలల్లో అనేకసార్లు ఈ అల్ హింద్‌తో నాలుగైదుసార్లు ఐసిస్ అధినేత అబు బకర్ అల్‌బాగ్దాదీగా చెప్పుకున్న వ్య క్తితో సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చా డు.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న ఎన్‌ఐఏ అధికారులు హ్యాండ్లర్‌ను గుర్తించే అంశం పై దృష్టిపెట్టారు. ప్రాథమికంగా లభించిన సాంకేతిక ఆధారాలను బట్టి ఆ వ్యక్తులు సిరి యా నుంచే కాంటాక్ట్ చేసినట్లు నిర్థారణైనా.. వారు బగ్దాదీ, ఆర్మర్ ఔనా? కాదా? అనేది శోధిస్తున్నారు. ఓ వ్యక్తి పేరులో ‘అల్ హింద్’ అనేది చేర్చాడంటే అతడు భారత్‌కు చెందిన వాడై ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యం లోనే షఫీ ఆర్మర్‌గా భావించాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
 
సేఫ్ జోన్ అనే ‘నంది’లో బస
మరోవైపు నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ఇబ్రహీం యజ్దానీలో విచారణ నేపథ్యంలో పశ్చాత్తా ప ఛాయలు కనిపించట్లేదని అధికారులు చెప్తున్నారు. తాము చేసేది తప్పుకాదంటూ చెప్తున్న అతగాడు.. ఆపరేషన్ పూర్తి చేసేం దుకు సిద్ధమైన సమయంలో ‘లక్ష్యం’ కోసం కొందర్ని చంపినా, చనిపోయినా వంద రెట్లు పుణ్యం వస్తుందన్నది తమ నమ్మకమని చెప్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ మాడ్యూల్‌కు చెందిన ఇరువురు మేలో అనంతపురం వెళ్లి, అక్కడి నంది లాడ్జ్‌లో బస చేయడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడైంది.

అనంతపురం వెళ్లినప్పుడు వీరు బస్టాండ్ సమీపంలోని హోటళ్లు, లాడ్జిల్ని పరిశీలించా రు. అక్కడ బస చేస్తే భవిష్యత్తులో తమ ఉనికి బయపటపడే ప్రమాదం ఉందని వీరు భావించారని తెలిసింది. అందుకే నంది లాడ్జిని ఎంపిక చేసుకుని.. హైదరాబాద్‌కు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తికి చెందిన ఓటరు గుర్తింపు కార్డును ఇచ్చారు. ఈ కార్డు ఇబ్రహీం బంధువుకు చెందిన మీ సేవ కేంద్రం నుంచే తీసుకున్నట్లు వెల్లడైంది. నిందితుల కస్టడీకి గడువు ముగుస్తుండటంతో శుక్రవారం నుంచి విచారణ వేగవంతం చేయాలని ఎన్‌ఐఏ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement