అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌కు అవార్డు
కాంగ్రెస్ నేతలపై మండిపడిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన పార్టీగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి అవార్డు దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పోరాడటానికి ప్రజా సమస్యలేవీ లేక కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావకు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేస్తున్న విమర్శలు హుందాగా లేవన్నారు.
గతంలో ఇలాంటి అవార్డు ఆ పార్టీ సీఎంలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండబోరని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు అవార్డు వస్తే ఉత్తమ్‌కు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం లో మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు.