
ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న ప్రభుత్వం
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
మంకమ్మతోట: పేద దళితులకు భూము లు పంపిణీ చేస్తామ ని ఆశలు రేకెత్తించి ప్రభుత్వం ఆత్మహ త్యలకు పురిగొల్పుతోందని సీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళ వారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వం దళితులపై కక్షసాధింపు చర్యల కు పాల్పడుతోందన్నారు.
గూడూరుకి చెం దిన శ్రీనివాస్, పరశురామ్‌లు ప్రభుత్వం ఇస్తున్న భూమి తమకు ఇప్పించాలని కోరితే.. డబ్బులు ఇస్తేనే భూములు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం తోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఆత్మ హత్యలను పురిగొల్పే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలన్నారు.