
అవార్డులతో పనిలేదంటున్న కంగనా
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తనకు అవార్డులతో పని లేదంటోంది. అందుకే అవార్డుల కార్యక్రమాలకు తాను హాజరు కానని చెబుతోంది. కెరీర్‌లో తాను సాధించాల్సిందిగా ఇంకా చాలా ఉందని, అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలే తనకు ముఖ్యమని అంటోంది. అయితే,
అవార్డులకు నామినేట్ కాకపోవడం వల్లనే ఆమె ఇలాంటి మాటలు చెబుతోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.