కృష్ణా పరీవాహకంలో ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
కృష్ణా పరీవాహకంలో ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు త్వరలోనే నిండనున్నాయి. ఎగువ పరీవాహకం నుంచి ప్రాజెక్టుల్లోకి భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో ఒకట్రెండు రోజుల్లో అవి నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌లో కేవలం 30 టీఎంసీలు చేరితే చాలు..దిగువకు కృష్ణా పరవళ్లు తొక్కనుంది. గత ఏడాది ఆగస్టు రెండో వారంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకు కృష్ణా వరద నీరు రాగా ఈ ఏడాది జూలై ఆఖరికే మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉండటం రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశమని నీటి పారుదల వర్గాలంటున్నాయి. తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో ఉండటం సైతం రాష్ట్రానికి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.