టెట్‌కు పక్కా ఏర్పాట్లు చేయండి
అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, టెట్ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,200 పైగా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి జిల్లా స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆదేశించారు.