గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య | Man Dies After Falling Down gandhi hospital in hyderabad | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Jun 22 2015 8:43 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - Sakshi

గాంధీ ఆస్పత్రి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పై నుంచి  దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగింది. కాగా మృతి చెందిన వ్యక్తి కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ గా గుర్తించారు. శివప్రసాద్ దగ్గర ఏపీ టీవీ చాంబర్‌కు చెందిన గుర్తింపు కార్డు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కాగా అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement