సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత క్రియాశీలకంగా లేవంటూ దేశంలోని పలు కంపెనీలను రద్దు చేస్తూ కేంద్ర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాటిల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు మరే ఇతర కంపెనీలో నూ డైరెక్టర్లుగా ఉండేందుకు వీల్లేదంటూ వారి డైరెక్టర్ గుర్తిం పు సంఖ్య(డిన్)ను సైతం డీయాక్టివ్ చేశారని పిటిషన్‌లో తెలి పారు.
డీయాక్టివేట్ చేసిన తమ డిన్‌లను క్రియాశీలకం చేసే లా ఆదేశాలివ్వాలని యోహాన్ దూంజీ మిస్త్రీ, దనేశ్ దూంజీ మిస్త్రీ, దూంజీ జహంఘీర్ మిస్త్రీ, రచ్నా దూంజీ మిస్త్రీలు కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దూళిపాళ్ల వీఏఎస్ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు యోధన్ ఇన్ ఫ్రా, ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని, ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదన్నారు.
వాదనలు విన్న ధర్మాసరం వారి డిన్, సిన్‌ను యాక్టివ్ చేయాలని కేంద్రా న్ని ఆదేశించింది. పిటిషనర్లను వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగేందుకు అనుమతివ్వాలని తెలిపింది. డిన్‌ను క్రియాశీలకం చేశాక వార్షిక రిటర్న్స్‌ను సమర్పించాలని పిటిషనర్ల ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయా లని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment