మంత్రుల అధికారిక పర్యటనలు బంద్!
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై దృష్టి
- ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వద్దన్న సీఎం
- మందకొడిగా సాగుతున్న తీరుపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సమన్వయ సమితిల ఏర్పాటును అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం కీలకంగా భావిస్తోంది. నిర్ణీత గడువులోగా వాటి ఏర్పాటును పూర్తి చేయా లని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. సమి తుల ఏర్పాట్లు పూర్తయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అధికారిక పర్యటనలు పెట్టుకోవ ద్దని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మందకొడిగా సాగుతున్న రైతు సమన్వయ సమితిల ఏర్పాట్ల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచా రం. కాగా, ఈనెల 7వ తేదీన జరగాల్సిన మంత్రి కేటీఆర్ నల్లగొండ పర్యటనను కూడా రద్దు చేసుకోవాలని ఆదేశించారని తెలిసింది. దీంతో ఆ జిల్లాలో మంత్రి పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్‌కు మంగళవారం సమాచారం కూడా ఇచ్చారు. అధికారిక గణాంకాల మేరకు 10వేల 733 రెవెన్యూ గ్రామాల్లో అంతే సంఖ్యలో సమన్వయ సమితిలు ఏర్పాటు కానున్నాయి. కాగా, ఇప్పటి వరకు వీటిలో కనీసం పావు వంతుకూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం.
‘నామినేటెడ్’ విధానంతో పార్టీ శ్రేణులకు అవకాశం?
గ్రామ రైతు సమితిలో 15 మంది, మండల సమితిలో 24 మంది, జిల్లా సమితిలో 24 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది చొప్పున సభ్యులను తీసుకోవా లని నిర్ణయించారు. అదీ నామినేటెడ్ విధానంలో నియమించనుండడం, పూర్తి బాధ్యత మంత్రులకే అప్పజెప్పడంతో ఈ సమితుల్లో సభ్యులుగా రైతులైన టీఆర్‌ఎస్ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలకే పదవులు దక్కను న్నాయి. మొత్తంగా లక్షా 60వేల మందికి సభ్యులుగా అవకాశం వస్తోంది. మారిన నిబంధనల నేపథ్యంలో గ్రామ రైతు సమన్వయ సమితుల్లోని సభ్యుల నుంచే మండల కమిటీలు, అందులో నుంచి జిల్లా కమిటీల్లోకి, జిల్లా సమితుల నుంచే రాష్ట్ర సమితి సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీటి వల్ల గ్రామగ్రామాన రైతుల్లో బలపడేందుకు ఉపకరిస్తుందన్న ఆశ పార్టీలో ఉంది. ఈ కారణంగానే మంత్రులు ఎట్టి పరిస్థితిల్లో తమకు అప్పజెప్పిన జిల్లాలకే పరిమితం కావాలని, అధికారిక కార్యక్ర మాలు ఏమీ పెట్టుకోకుండా రైతు సమ న్వయ సమితిల ఏర్పాటు ప్రక్రియను 9వ తేదీలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిం చారని చెబుతున్నారు.
క్లిష్టంగా మారిన ఎంపిక ప్రక్రియ
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు కానున్న సమితిల ద్వారా పార్టీ కేడర్‌కు పదవులు దక్కనున్నాయి. ఇందులో సభ్యుల ఎంపిక బాధ్యతను పాత జిల్లాల వారీగా మంత్రులకు అప్పజెప్ప డంతో గ్రామాల వారీగా సంబంధిత నియో జకవర్గ ఎమ్మెల్యేల నుంచి జాబితాలు తీసుకుంటున్నారు. ఒక్కో గ్రామ సమితిలో 15 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉండడం, ఒక్కో రెవిన్యూ గ్రామ పరిధిలో ప్రధానమైనవి అనుకునే పెద్ద గ్రామాలూ ఉండడంతో సభ్యులను ఎంపిక చేయడం కొంత క్లిష్టంగా మారిందంటున్నారు.
క్షేత్ర స్థాయిలో పార్టీపై పట్టు చిక్కించుకునేం దుకు ఈ సమన్వయ సమితిలు ఎంతగానో ఉపయోగపడతాయన్న ఆశకూడా పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో భవిష్యత్ రాజకీయా లను దృష్టిలో పెట్టుకునే వీరిని ఎంపిక చేస్తున్నారు. దీంతో సహజంగానే ఎంపిక ఆలస్యమవుతోందని చెబుతున్నారు. అసం తృప్తులు బయటపడి రచ్చ జరగకుండా వీరందరినీ ముందే ఎంపిక చేసి, జాబితా లు సిద్ధంగా పెట్టుకుని ఆఖరి రోజున ప్రకటించే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు.