సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)ని ప్రవేశపెట్టాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై శుక్రవారం అన్ని జిల్లాల డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల వారీగా దీర్ఘకాలిక సెలవులు పెట్టిన ఉపాధ్యాయుల జాబితాను రూపొందించి డెరైక్టరేట్‌కు పంపిం చాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐవీఆర్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేసుకుని, మధ్యాహ్న భోజనం తింటున్న పిల్లల వివరాలను పంపించాలన్నారు.
హైస్కూళ్లలో ఎన్‌సీసీ
Published Sat, May 14 2016 3:24 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement