హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు.. నగరంలోని షేక్‌పేట్ గుల్షాన్ కాలనీలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరాయిన్, 5.2 కిలోల గంజాయి, 2 పాస్‌పోర్ట్‌లు, 2 సెల్‌ఫోన్లు, రూ. 21 వేల నగదుతో పాటు ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు టాస్క్‌పోర్స్ అదనపు డీసీపీ ఎన్. కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా డ్రగ్స్‌ను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. నైజీరియన్ ముఠా గుట్టు రట్టు చేసిన సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు గోల్కొండ పోలీసులను ఆయన అభినందించారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లు అరెస్ట్
Published Fri, Dec 2 2016 5:01 PM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM
Advertisement