
'ఏ క్షణంలోనైనా స్టేట్ మెంట్ ఇస్తారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై శాసనసభలో ప్రకటన చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్పీకర్ అనుమతిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదాపై స్టేట్ మెంట్ ఇస్తారని చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక హోదాపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వైఎస్సార్ సీపీ ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశంపై ప్రభుత్వాన్ని కదిలించేలా ఒత్తిడి తేస్తామని తెలిపింది.