
షీ-టీమ్‌కు చిక్కిన కళాశాల ప్రిన్సిపాల్
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ ఓ కళాశాల ప్రిన్సిపాల్ గురువారం షీ-టీమ్‌కు దొరికాడని క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు.
బస్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ దొరికిన ఘనుడు
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ ఓ కళాశాల ప్రిన్సిపాల్ గురువారం షీ-టీమ్‌కు దొరికాడని క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. నిజాంపేట్‌కు చెందిన మాల్గి ధన్‌శెట్టి (38) బాచుపల్లిలోని గాయత్రి జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్. ఇతను ప్రతిరోజూ తన బైక్‌పై లక్డీకాపూల్ బస్టాప్‌కు వచ్చి.., అక్కడ తన బైక్‌ను పార్క్ చేస్తున్నాడు. ఒంటరిగా బస్టాప్‌లో ఉన్న మహిళలను తన బైక్‌పై రమ్మని చెప్పి.. ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నాడు. ఇదే విధంగా గురువారం ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతుండగా ఆ దృశ్యాలను షీ-టీమ్ వీడియో తీసి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎవరు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా ఉపేక్షించేది లేదని అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా హెచ్చరించారు.
స్కూల్ విద్యార్థులను వేధిస్తూ...
ఇద్దరు ఇంటర్ విద్యార్థులు (బాలలు) తార్నాక బస్టాప్‌లో కూర్చుని స్కూల్ పిల్లలను ఈవ్‌టీజింగ్ చేస్తూ షీ-టీమ్‌కు చిక్కారు. వీరిని అదునపులోకి తీసుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులను పిలి పించి.. వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
మాసెల్‌కు కాల్ చేయండి...
విద్యార్థినులకు సెల్‌నెంబర్ ఇచ్చి తమకు ఫోన్ చేయాలని వేధిస్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులను షీ-టీమ్ పట్టుకుంది. మలక్‌పేట్‌కు చెందిన విద్యార్థులు మెహిదీపట్నంలోని డెక్కన్ బేకరీలో కూర్చున్న యువతులకు ఒక కాగితంపై తమ సెల్‌నెంబర్లు రాసి ఫోన్ చేయాలని వేధిస్తున్నారు. సమాచారం అందుకున్న షీ-టీమ్ సభ్యులు వీడియో ఆధారంగా వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.