సాక్షి, సిటీబ్యూరో:
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్‌లో అభాసుపాలైంది. మొదటి, రెండో విడత కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను పరిష్కరించకుండా, మూడో విడత అంటూ వచ్చిన యంత్రాంగానికి ప్రజలు ముచ్చెమటలు పట్టించారు. ప్రజా వ్యతిరకేతను ముందే ఊహించిన మం త్రులు కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు భద్రతతో పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ కేవలం తన నియోజకవర్గం లో ని కార్యక్రమానికే పరిమితంకాగా, మరో మంత్రి దానం నాగేందర్ నగరంలోనే ఉన్నా ఒక్క కార్యక్రమంలోనూ పా ల్గొనలేదు. ఇక, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి గీతారెడ్డి అసలు ఇటువైపే చూడలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్ ప్రాంతాల్లోనూ ఇదే తంతు కొనసాగింది.
అన్నిచోట్లా రచ్చ.. రచ్చ
గొడవలు, వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు, అరెస్టులు.. ఇదీ రచ్చబండ కార్యక్రమాల్లో కనిపించిన సాధారణ దృశ్యం. కొన్నిచోట్ల తెలంగాణవాదులు రచ్చబండ ఫ్లెక్సీలపై సీఎం బొమ్మను చించివేసిన ఘటనలతో ఉద్రిక్తత నెలకొంది. మరికొన్ని చోట్ల ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల వంటి వాటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. ఆయా సందర్భాల్లో ఉద్రిక్తత సైతం నెలకొంది. ప్రజాప్రతినిధులను అడ్డుకున్న ఘటనలతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇక, పలుచోట్ల ఆయా పథకాల కోసం ప్రజలు పెద్దసంఖ్యలో దరఖాస్తులను సమర్పించారు. గంటల తరబడి వరుసలో నిల్చుని దరఖాస్తులు ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డారు. కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇంకొన్ని చోట్ల జనం లేక కార్యక్రమాలు వెలవెలబోయాయి. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ జిల్లాలో ఇలా..
రచ్చబండ తేదీలు: నవంబరు 11-26
జరిగిన నియోజకవర్గాలు: 16
మొత్తం కార్యక్రమాలు: 39
రేషన్‌కార్డుల దరఖాస్తులు: 36,548
పింఛన్ల కోసం..: 2,292
రేషన్‌కార్డుల పంపిణీ: 33,431
పింఛన్లు: 11,122
మొక్కుబడిగా రచ్చబండ..
Published Wed, Nov 27 2013 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement