నల్లకుంట (హైదరాబాద్): ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సిన అవశ్యకత ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఈ దిశగా చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర మంత్రిగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే బ్రాహ్మణ పెద్దలతో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఆదివారం నల్లకుంట శంకరమఠం ప్రాంగణంలో బ్రాహ్మణ ఉద్యోగులు, వృత్తి నిపుణుల సంఘం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ... విద్యావంతులైన బ్రాహ్మణులు రాజకీయాల్లో రావాల్సిన అవసరముందని చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయ భూములను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్‌లో దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.సతీశ్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాల కిషన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు శ్రీశ్రీశ్రీ ధర్మపురి సద్గురు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కల్పించాలి: దత్తాత్రేయ
Published Sun, May 17 2015 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement