వణికిన గ్రిడ్
- ఒక్కసారిగా సగానికి పడిపోయిన విద్యుత్ డిమాండ్
- రాత్రంతా అంధకారంలోనే హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: గాలివాన రేపిన దుమారంతో విద్యుత్ గ్రిడ్ వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అకస్మాత్తుగా పడి పోయింది. దాంతో, బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 7,177 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్ కాస్తా అర్ధరాత్రి 11.59 గంట ల ప్రాంతంలో ఒక్కసారిగా 3,459 మెగావాట్లకు పడిపోయింది. ఇలా డిమాండ్ ఒక్కసారిగా సగా నికి పైగా తగ్గిపోవడంతో విద్యుత్ గ్రిడ్ కుప్ప కూలి రాష్ట్రమంతటా చీకటయ్యే ప్రమాదం ఏర్ప డింది. ట్రాన్స్‌కో, జెన్‌కో అప్రమత్తంగా వ్యవ హరించడంతో గండం గడిచింది.
బొగ్గుతో నడి చే థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని ఒక్కసా రిగా 70% మించి తగ్గించే అవకాశం ఉండదు. దాంతో థర్మల్ కేంద్రాలను బొగ్గుకు బదులు ఆయిల్‌తో నడిపి అప్పటికప్పుడు విద్యుదుత్ప త్తిని తగ్గించినట్టు ట్రాన్స్‌కో ఇన్‌చార్జి సీఎండీ సి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు సమానంగా సరఫరా ఉంటేనే గ్రిడ్ సురక్షితంగా ఉంటుంది. హెచ్చుతగ్గులుంటే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రమంతటా అంధకారం నెలకొనే ప్రమాదముంటుంది.
అంధకారంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు
మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని దక్షిణ రాష్ట్రం లో పలు ప్రాంతాల్లో అం«ధకారం నెలకొంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) పరిధిలో మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 5,003 మెగావాట్లుగా నమో దైన విద్యుత్ డిమాండ్ అర్ధరాత్రి వర్షం కారణం గా 2,160 మెగావాట్లకు పడిపోయింది. ప్రధా నంగా హైదరాబాద్‌లో రాత్రంతా చీకట్లు నెలకొ న్నాయి. పాత మహబూబ్‌నగర్, మెదక్, నల్ల గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ జిల్లాల పరిధిలో 405 విద్యుత్ స్తంభాలు, 22 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి.
రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలో 100, రంగారెడ్డి సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో మరో 120 స్తంభాలు కుప్పకూలాయని టీఎస్‌ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం దాకా 3,000కు పైగా ఫిర్యాదులందాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, గ్రీన్‌లాండ్స్, ద్వార కాపురి కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. మొత్తంగా గ్రేటర్‌లో 340 విద్యుత్ ఫీడర్ల పరిధిలో అంతరా యం కలిగింది. యుద్ధప్రాతిపదికన బుధవారం సాయంత్రంలోగా 324 ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించినట్టు టీఎస్‌ఎస్పీడీ సీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు.
నగరంలో ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ‘‘సంస్థ పరిధిలో దాదాపు 99 శాతం సరఫరాను పునరుద్ధరించాం. గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు దాదాపుగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం. వ్యవసాయ కనెక్షన్లకు ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరిం చలేదు. అయితే వర్షం కారణంగా వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ కూడా లేదు. సరఫరా నిలిచిపోయిన పేదల గృహాలకు ఉచితంగా సర్వీసు వైర్లు బిగించి తక్షణం సరఫరా పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించాం’’ అని వెల్లడించారు. సమస్యలుంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు 9490619846, 7382071574, 7382072104, 7382072106 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.