తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం | telangana eamcet applications receiving start | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Published Mon, Feb 29 2016 4:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

telangana eamcet applications receiving start

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-16 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన మొదటి రోజే 3,279 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఈ దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 1,657 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 1,597 మంది, రెండూ రాసేందుకు 25 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెలాఖరుకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసే నాటికి 2.75 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement