ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సాయి అనే వ్యక్తి బైక్‌పై గంజాయి తరలిస్తుండగా.. గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఓ బైక్‌తో పాటు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.