బిచ్చగాళ్ల మాఫియా లేదు: కమిషనర్
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియాపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్కుమార్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల మాఫియా లేదని ఆయన అందులో తెలిపారు.
వీధుల్లో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చం ఎత్తుకుంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అన్నారు. బిచ్చగాళ్లకు పునరావాసం కోసం కార్పొరేషన్ చేపడుతున్న చర్యలను కోర్టుకు తెలిపారు. 'గౌరవం' పేరుతో వారికి కేంద్రాలు ఏర్పాటుచేసి, జీవనోపాధి మార్గాలను కూడా అందజేస్తున్నామన్నారు.