టుడే న్యూస్‌అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌అప్‌డేట్స్

Published Mon, Apr 18 2016 7:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

today news updates

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి లను కలుస్తారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ వారికి వివరిస్తారు.
గుజరాత్:  నేడు గుజరాత్ బంద్‌ కు పటేల్ సామాజికవర్గం పిలుపునిచ్చింది.
చెన్నై: తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను లెఫ్ట్ పార్టీలు సోమవారం విడుదల చేయనున్నాయి.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో నీటి సమస్య, రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీపై చర్చించనున్నారు.
హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో అత్యాధునిక సీసీటీవీ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేడు ప్రారంభిస్తారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం కానున్నారు.
విశాఖపట్నం: విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్ నాథ్ దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన్ను కేజీహెచ్‌కు తరలించారు. అమర్‌నాథ్ ఆస్పత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ముంబై ఇండియన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement