టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ | TRS plenary meeting of the resolutions committee | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ

Published Tue, Apr 19 2016 3:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ - Sakshi

టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాలపై కసరత్తు మొదలుపెట్టింది. తీర్మానాల కమిటీ సోమవారం ఈ మేరకు తెలంగాణ భవన్‌లో సమావేశమై చర్చించింది. ఈ కమిటీకి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షత వహించగా.. మొత్తం 12 అంశాలపై చర్చించారు. వ్యవసాయం, తాగునీటి రంగం, కరువు, ఐటీ, ఇండస్ట్రీయల్ పాలసీ, రాజకీయ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై తీర్మానాలను కమిటీ సిద్ధం చేసింది.

ఈ తీర్మానాలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ముందు ఉంచనున్నారు. ఈ అంశాలన్నింటిని కలిపి ఒకట్రెండు తీర్మానాలకు కుదిస్తారా లేక అంశాల వారీగానే ఉంచాలా అన్న దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతే తీర్మానాలకు తుది రూపు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కె.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement