వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి | vijaya saireddy met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి

Published Tue, May 31 2016 4:39 PM | Last Updated on Thu, Aug 9 2018 3:21 PM

వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన విజయ సాయిరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి విజయ సాయిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఆయనకు పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు విజయ సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), టీజీ వెంకటేష్ (టీడీపీ), సురేష్ ప్రభు (బీజేపీ), విజయ సాయిరెడ్డి (వైఎస్ఆర్ సీపీ) నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement