హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెప్పి శాసన సభను తప్పుదోవ పట్టించారని బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీలో లేబర్ కంపోనెంట్ 60 శాతం, అంతకన్నా ఎక్కువగా ఉండోచ్చు కానీ.. మెటీరియల్ కాంపోనెంట్ మాత్రం 40 శాతానికి మించొద్దని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లేబర్ కాంపోనెంట్ 97.54 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. మంగళవారం సభలో ఉపాధి హామీపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడి సభను తప్పుదోవ పట్టించారన్నారు.
'చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించారు'
Published Wed, Mar 30 2016 12:17 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement