'ప్రత్యేక హోదాపై మోదీ ప్రకటన చేయాలి' | yv subbareddy demands modi to special status to AP | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాపై మోదీ ప్రకటన చేయాలి'

Published Wed, Oct 21 2015 3:12 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

yv subbareddy demands modi to special status to AP

హైదరాబాద్ : రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదాపై గురువారం ప్రకటన చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. తాము ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ గతంలోనే లేఖ రాశామని, ఈ విషయమై బుధవారం కూడా ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించామని తెలిపారు.

అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, ప్రధాని మోదీ మాత్రం ప్రత్యేక హోదాపై ప్రకటన ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. గన్నవరం లేదా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని కలిసి ప్రత్యేక హోదాపై వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement