సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచ దేశాలపై కరోనా విభృంభణ కొనసాగుతూనే ఉంది. మొదటితో పోలిస్తే పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా అదుపులోకి రావడంలేదు. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81.07 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్ బారినపడి 4.38 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 41.87 లక్షల మంది కోలుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌లో కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. (చైనాలో భారీగా కరోనా పరీక్షలు)
- అమెరికాలో 21,82,548 పాజిటివ్ కేసులు, 1,18,279 మంది మృతి
- బ్రెజిల్‌లో 8,91,556 పాజిటివ్ కేసులు, 44,118 మంది మృతి
- రష్యాలో 5,37,210 పాజిటివ్ కేసులు, 7,091 మంది మృతి
- ఇంగ్లండ్‌లో 2,96,857 పాజిటివ్ కేసులు, 41,736 మంది మృతి
- స్పెయిన్‌లో 2,91,189 పాజిటివ్ కేసులు, 27,136 మంది మృతి
- ఇటలీలో 2,37,290 పాజిటివ్ కేసులు, 34,371 మంది మృతి
- పెరూలో 2,32,992 పాజిటివ్ కేసులు, 6,860 మంది మృతి
- ఇరాన్‌లో 1,89,876 పాజిటివ్ కేసులు, 8,950 మంది మృతి
- జర్మనీలో 1,88,044 పాజిటివ్ కేసులు, 8,885 మంది మృతి
- టర్కీలో 1,79,831 పాజిటివ్ కేసులు, 4,825 మంది మృతి
- చిలీలో 1,79,436 పాజిటివ్ కేసులు, 3,362 మంది మృతి
- ఫ్రాన్స్‌లో 1,57,372 పాజిటివ్ కేసులు, 29,436 మంది మృతి
- మెక్సికోలో 1,46,837 పాజిటివ్ కేసులు, 17,141 మంది మృతి
- పాకిస్తాన్‌లో 1,44,478 పాజిటివ్ కేసులు, 2,729 మంది మృతి
- సౌదీ అరేబియా 1,32,048 పాజిటివ్ కేసులు, 1,011 మంది మృతి
- కెనడాలో 99,147 పాజిటివ్ కేసులు, 8,175 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment