
నేపాల్ లో మరోసారి భూకంపం
కఠ్మండు: నేపాల్ ను భూదేవి కరుణించడంలేదు. ఇప్పటికే పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి నేపాల్ రాజధాని కఠ్మండులో భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి. నాలుగు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
ఇటీవల నేపాల్లో సంభవించిన భారీ భూకంపాల ధాటికి ఇప్పటివరకు 3 వేల 700 మంది మృతి చెందారు. 6 వేల 833 మంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రెస్య్యూ బృందాలు తాజాగా స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే నేపాల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఆరంభమైంది. ఇదిలా ఉండగానే మరోసారి భూకంపం రావడం దేశంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే భూకంప తీవ్రత ఎంత ఉండవచ్చనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.