మరో వీడియో విడుదల చేసిన ఐసిస్
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరో వీడియో విడుదల చేసింది. వీడియోలో కనిపించిన వ్యక్తి అమెరికన్ ఐసిస్ ఫైటర్నంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ.. ఆర్లాండో గే నైట్ క్లబ్పై దాడి చేసిన ఒమర్ మతీన్ను ప్రశంసించాడు. అమెరికాలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఆర్లాండోలో దాడి జరిగిన వారం రోజుల తర్వాత ఐసిస్ ఆదివారం ఈ వీడియోను ఇరాక్లో విడుదల చేసింది.
ఆర్లాండో గే నైట్ క్లబ్లో అఫ్ఘానిస్తాన్ సంతతికి చెందిన ఒమర్ జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించగా, మరో 53 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ వెంటనే ప్రకటించింది. అయితే ఐసిస్ ఆదేశాల మేరకు ఒమర్ ఈ దాడి చేయలేదని, ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావంతో కాల్పులు జరిపాడని అధికారులు చెప్పారు.
ఐసిస్ విడుదల చేసిన వీడియోలో అమెరికన్ ఫైటర్తో పాటు ఫ్రాన్స్, ఇండోనేసియా, రష్యా, ఉజ్బెక్ దేశాలకు చెందిన ఉగ్రవాదులు కనిపిస్తారు. వీడియోలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫొటో ఓ వైపు, మరో వైపు ఒమర్ ఫొటోలు కనిపిస్తాయి. ఆర్లాండో దాడి దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.