‘ఆర్కిటిక్’పై తగ్గిన మంచు!
వాషింగ్టన్: ఆర్కిటిక్ సముద్రంపై ఉన్న మంచు ఈ చలికాలంలో రికార్డు స్థాయిలో వరుసగా రెండో ఏడాది కూడా తక్కువగా ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా వర్షాకాలం, ఎండాకాలంలో ఆర్కిటిక్ సముద్రం, దాని పక్కనున్న వాటిపై ఉన్న మంచు కరిగిపోతుంటుంది. ఈ నీరు చలికాలంలో మంచు రూపంలో సముద్రంపై పేరుకుపోతుంది.
అయితే ఈ ఏడాది ఇలా పేరుకుపోయే మంచు చాలా తక్కువగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత తక్కువ ఏర్పడటం 1979 తర్వాత ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. భూమి మొత్తం మీద, ఆర్కిటిక్ ప్రాంతంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్లే తక్కువ మంచు ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.