వారిద్దరూ దివ్యాంగులు. ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరు నడవలేరు. కానీ ఒకరికొకరు చేదోడు-వాదోడుగా ఉంటూ 29 ఏళ్లుగా దాంపత్య జీవనాన్ని సాగిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఆ దంపతులే.. కావో షుకాయ్.. షు హౌబి. చైనాలోని చాంగ్‌కింగ్ ప్రాంతంలో యాంగాన్ గ్రామానికి చెందినవారు. కావో షుకాయ్ పాక్షికంగా అంధుడు. ఆయన భార్య హౌబి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆధారంలేనిది నడువలేదు. భార్య ఎక్కడికైనా వెళ్లాలన్నా.. షుకావ్ తన వీపుపై మోసుకెళ్తాడు. ఆమెను ఒక బుట్టలో పెట్టుకొని.. ఆ బుట్టను భుజాన వేసుకొని.. బయటకు తీసుకెళ్తాడు. వీరి అరుదైన ప్రేమకథ ఇప్పుడు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
షుకాయ్ రైతు. తన ఇంటికి సమీపంలో ఉన్న భూమిలో పంటలు పండిస్తూ ఉంటాడు. ఇంటి పనిలో వ్యవసాయ పనుల్లో షుకాయ్‌కు హౌబి అండగా ఉంటుంది. వీరిద్దరి మధ్య పరిచయం ఆసక్తికరంగా చోటుచేసుకుంది. హౌబి సోదరిమణులు షుకాయ్ మేనత్తకు తెలిసినవారు. వారి ద్వారా ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మనసులు ముడిపడటంతో పెళ్లి చేసుకున్నారు. 29 ఏళ్లుగా వీరి వైవాహిక అనుబంధం కొనసాగుతోంది. 'నాకు ఏం కావాలన్నా హౌబిపై ఆధారపడతాను. అన్ని వేళల నన్ను మోసుకెళ్లడం అతనికి అంతగా వీలుపడదు. అందుకే ఆహార పదార్థాలు సహా నాకు ఏం కావాలన్నా ముందు తెచ్చిపెడతాడు. నేను ఇళ్లు కదలకుండా చూసుకుంటాడు' అని హౌబి చెప్తారు. 'మా చుట్టూ ఉన్నవాళ్లు మా మీద జోకులు వేస్తారు. 24 గంటలు ఒకరి కోసం ఒకరై బతికే మీలాంటి దంపతులను ఎక్కడ చూడలేదంటారు' అని షుకావ్ తెలిపారు.
ఆయన అంధుడు.. ఆమె నడువలేదు: ఇదొక గొప్ప ప్రేమకథ
Published Mon, Oct 16 2017 5:47 PM | Last Updated on Mon, Oct 16 2017 8:35 PM
1/1
Advertisement
Comments
Please login to add a commentAdd a comment