
హీరోయిన్ల గుండె పగిలింది
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల విషయం తెలిసి పలువురు హీరోయిన్లు స్పందించారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘటన దారుణమంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల విషయం తెలిసి పలువురు హీరోయిన్లు స్పందించారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘటన దారుణమంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు అనుష్కాశర్మ, ప్రియాంకా చోప్రాలతో పాటు త్రిష, ఇలియానా లాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించారు.
పొద్దున్న లేస్తూనే.. ప్యారిస్‌లో దాడుల గురించిన దారుణమైన విషయం తెలిసింది. ఈ పిరికిపందల దాడులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్యారిస్ ప్రజలకు మరింత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
-అనుష్కాశర్మ
ప్యారిస్‌లో జరిగినది తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. అసలు ఈ ప్రపంచానికి ఏమైపోతోంది.. ఈ హింసాకాండ జరగాల్సిన అవసరం ఏముంది.. ప్రే ఫర్ ప్యారిస్.. నా హృదయం గాయపడింది.
-ప్రియాంకా చోప్రా
పారిస్ ఘటన గురించి వినగానే చాలా బాధ పడ్డాను, పారిస్లో ఉగ్రదాడి బాధితులకు కోసం ప్రార్థిస్తున్నాను
-హన్సిక
ప్యారిస్ గురించి ఇంత దారుణమైన వార్తా! ఆ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. అసలు ఈ జనం ఏం కావాలనుకుంటున్నారు.. (తన ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లటి ఫొటో ఒకటి పెట్టింది)
-ఇలియానా
త్రిష మాత్రం ఏమీ వ్యాఖ్యలు చేయకుండా.. ప్యారిస్ విషయం తెలిసి గుండె బద్దలైందంటూ సింబాలిక్‌గా గుండె పగిలిన బొమ్మ పెట్టింది.
Woke up to the horrific news about attacks in Paris. Pray for more courage for the people in Paris against these cowardly attacks .
— Anushka Sharma (@AnushkaSharma) November 14, 2015