మడిచి.. జేబులో పెట్టుకోండి! | China Launch A New Mobile Phone | Sakshi
Sakshi News home page

మడిచి.. జేబులో పెట్టుకోండి!

Published Sun, Jan 27 2019 1:41 AM | Last Updated on Sun, Jan 27 2019 9:34 AM

China Launch A New Mobile Phone - Sakshi

చైనా మొబైల్‌ దిగ్గజ కంపెనీ షియోమీ ఓ వినూత్నమైన స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఇలాంటి ఫోన్లను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగరు. మొబైల్‌ను పర్స్‌ లాగా మడుచుకుని వాడొచ్చు. సరిగ్గా మధ్యకు మూడు, నాలుగు మడతలు వేయొచ్చు. మడిచిన ప్రతిసారి కూడా స్క్రీన్‌ వస్తుంది. ఆ స్క్రీన్‌ను కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. అరచేతిలో ఇమడలేనంత ట్యాబ్లెట్‌ పీసీ సైజు నుంచి చిన్న పాటి సైజు మొబైల్‌ వరకు దీన్ని మడుచుకోవచ్చు. దీన్ని షియోమీ కంపెనీ ‘చైనా ఆపిల్‌’అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఈ మొబైల్‌కు ఇంకా పేరు పెట్టలేదని, ఏదైనా మంచి పేరు సూచించాలని ఈ కంపెనీ ప్రెసిడెంట్‌ లిన్‌ బిన్‌ కోరుతున్నారు. ఈ మొబైల్స్‌కు సరైన డిమాండ్‌ ఉంటే త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement