మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు | Disappeared snow in oceans | Sakshi
Sakshi News home page

మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు

Published Sun, Nov 20 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు

మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు

వాషింగ్టన్: ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోని మంచు ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతోందని నాసా పరిశోధకులు చెప్పారు. సముద్రాల్లోని మంచు నిల్వలకు సంబంధించి 1979 నుంచి ఉన్న డేటాను అధ్యయనం చేసిన నాసాలోని గోడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకులు, ఈ ఏడాది అక్టోబర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ రెండు సముద్రాల్లోని మంచు కరిగిపోరుుందన్నారు.

రికార్డు స్థారుులో మంచు కరిగిపోవడం ఆర్కిటిక్‌కు కొత్తేమి కాదని, కానీ అంటార్కిటిక్‌లో కరిగిపోవడమే ఆశ్చర్యానికి గురిచేసిందని శాస్త్రవేత్త వాల్ట్ మియర్ తెలిపారు. ఇంతలా మంచు కరిగిపోవడానికి వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులే కారణమన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గాలి, నీరు కూడా చాలా వేడిగా ఉంటున్నాయని, మంచు కరిగేందుకు ఇవి కూడా ఓ కారణం కావచ్చని వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement