
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోని అన్ని భాషల యూజర్లకు ఫేస్‌బుక్‌ను మరింత దగ్గర చేసేందుకుగాను సంస్థ తన భాషా అనువాద (లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్) విభాగాన్ని పటిష్ట పరిచింది. కృత్రిమ మేథస్సు సాంకేతికతను ఉపయోగించి ఇతర భాషల్లో పెట్టే ఫేస్‌బుక్‌లోని పోస్టులు, కామెంట్లను కచ్చితంగా, తక్కువ సమయంలో వారివారి మాతృభాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగే నూతన అప్‌డేట్‌ను సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న అనువాద వ్యవస్థ కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే యూజర్లకు సులువుగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్ చేయగలవు. అయితే ఉర్దూ, బర్మీస్ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి వాటిని అధిగమించేందుకు గాను మెషిన్ ట్రాన్స్‌లేషన్ సిస్టమ్‌లోకి వికిపీడియా లాంటి వెబ్‌సైట్‌ల్లోని వేర్వేరు భాషల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాఖ్యాలను అప్‌లోడ్ చేసింది. దీంతో ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment