చార్లెస్ శోభరాజ్ ఆందోళన | I do not know will survive after my heart surgery, says Charles Sobhraj | Sakshi
Sakshi News home page

నా కథ ముగుస్తుందేమో!: చార్లెస్ శోభరాజ్

Published Thu, Jun 8 2017 8:50 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

చార్లెస్ శోభరాజ్ ఆందోళన

చార్లెస్ శోభరాజ్ ఆందోళన

కట్మాండ్: ఉగ్రవాద సంస్థలకు తాను ఆయుధాలు సరఫరా చేశానని గతంలోనే ప్రకటించిన సీరియల్ బికినీ కిల్లర్, అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్ ఆందోళన చెందుతున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శోభరాజ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చింది. ఈ శనివారం శోభరాజ్‌కు కట్మాండులోని గంగాలాల్ హార్ట్ సెంటర్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. అయితే ఆపరేషన్ తర్వాత తాను బతికే ఉంటానన్న నమ్మకం లేదని.. ఇలాగా తాను కొందరికి ఫోన్ చేయాలని అందుకు పర్మిషన్ ఇవ్వాలని జైలు అధికారులను శోభరాజ్ కోరాడు.

శోభరాజ్ గుండెలో ఓ వాల్వ్ పూర్తిగా దెబ్బతిందని త్వరగా వైద్యం చేయాలని డాక్టర్లు అతడికి సూచించారు. అయితే తన సొంత దేశమైన ఫ్రాన్స్ లోని ప్యారిస్‌లో సర్జరీకి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అవకాశం ఇవ్వలేదు. ఫ్రాన్స్‌లో అయితే ఆపరేషన్ రిస్క్ 1 శాతం ఉండగా, కట్మాండులో మాత్రం రిస్క్ 3-5శాతం ఉంటుంది. దీంతో తన ప్రాణాలు పోతాయన్న భయం శోభరాజ్‌కు పట్టుకుందని ఆయనకు గత ఐదేళ్లుగా ట్రీట్‌మెంట్ ఇస్తున్న సీనియర్ డాక్టర్ తెలిపారు. ఓ వాల్వ్ దెబ్బతిన్నది. జూన్ 10న సర్జరీ నిర్వహిస్తాం. అతడి పరిస్థితి నార్మల్‌గానే ఉంది కానీ అతడిలో ప్రాణభయం పెరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు.

'2016 చివరలో జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెళ్లి సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. నేపాల్ సుప్రీంకోర్టులో ఇటీవల విచారణకు హాజరు కాగా.. నేపాల్ లోనే నువ్వు చావడం ఖాయమని నాపై కేసు వేసిన వ్యక్తి బెదిరించాడు. దీంతో ప్యారిస్‌లో సర్జరీ చేయించుకునేందుకు పర్మిషన్ ఇప్పించాలని ఫ్రాన్స్ ఎంబసీకి నేను రాశాను. ఆరోగ్యం బాగాలేని కారణంగా త్వరగా విడుదల చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తాను. కట్మాండు నుంచి ప్యారిస్ వెళ్లి నేను చేయాల్సిన పనులు పూర్తిచేయాలని భావిస్తున్నానని' చార్లెస్ శోభరాజ్  చెప్పినట్లు సమాచారం.

ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరిన శోభరాజ్‌.. న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి 1986లో పరారయ్యాడు. ఆపై అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండు జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. 2003లో ఓ క్యాసినో నుంచి తప్పించుకునే క్రమంలో కట్మాండు పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement