
న్యూయార్క్ : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే శృంగార పాఠాలు బోధిస్తూ అరెస్టు అయిన బెలరుసియన్ మహిళ అనస్టాషియా వాషుకెవిక్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలో తాజాగా ఓ బాంబు పేల్చింది. ట్రంప్ అధ్యక్షుడుగా మారేందుకు రష్యాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఆయన ప్రచారానికి రష్యా ఎలా సహకరించిందో పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు.
చిత్ర విచిత్రమైన అశ్లీల పోజులతో సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రమ్ పెట్టి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన అనస్టాషియాను.. విచ్చలవిడిగా శృంగార పాఠాలు బోధిస్తున్నారని, అది కూడా అనుమతి లేకుండా చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తన జీవితం గురించి భయం వేస్తోందని పేర్కొన్న ఆమె డోనాల్డ్ ట్రంప్‌తో రష్యా సంబంధాల గురించి తన వద్ద రహస్యాలు ఉన్నాయని, వాటిని తన భద్రతకు ఉపయోగించుకుంటానని చెప్పింది. అయితే, ఆ రహస్యాల్లో ఏది కూడా ప్రస్తుతానికి బయటపెట్టేందుకు ఆమె అంగీకరించలేదు. అయితే, ఆమె చెప్పే మాటలు ఎంతమేరకు నమ్మశక్యమైనవా కాదా.. అనే విషయం తేలాల్సి ఉంది.