బ్రిడ్జ్‌పై పేలిన డబుల్ డెక్కర్ బస్సు.. ప్రజలకు షాక్!
అది సెంట్రల్ లండన్‌లోని లాంబెత్ బ్రిడ్జ్. అత్యంత భద్రత ఉండే ఎంఐ5 ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరం. ఆదివారం ఉదయం కావడంతో ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలో సేద దీరుతున్నారు. ఇంతలోనే లాంబెత్ బ్రిడ్జ్‌పై ఓ డబుల్ డెక్కర్ బస్సు ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద పెట్టున శబ్దం చేస్తూ.. మంటలు ఎగజిమ్ముతూ పేలుడు జరుగడంతో దానిని చూసిన ప్రజలు అదిరిపోయారు. 2005 జూలై 7నాటి ఉగ్రవాద దాడులను తలపిస్తూ ఈ పేలుడు జరుగడంతో ముష్కరులు మళ్లీ లండన్‌పై పంజా విసిరారా? అని బెంబేలెత్తారు. ప్రజలు ఇలా బిక్కుబిక్కుమంటుడగా.. చావు కబురు చల్లగా చెప్పినట్టు అధికారులు అది నిజమైన పేలుడు కాదు.. ఓ సినిమా షూటింగ్ కోసం తీసిన ఉత్తుత్తి పేలుడు అంటూ తేల్చేశారు.
యాక్షన్ స్టార్ జాకీచాన్ తాజా హాలీవుడ్ సినిమా 'ద ఫారేనర్' కోసం ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. నిజమైన పేలుడుకు ఏమాత్రం తీసిపోనిరీతిలో లాంబెత్ వంతెనపై తీసిన ఈ షూటింగ్ తో షాక్ తినడం ప్రజల వంతైంది. స్థానిక ప్రజలకు సమాచారమివ్వకుండా సినిమా షూటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారు.. వంతెనపై నిజంగా బస్సును పేల్చడమేమిటి అంటూ స్థానిక నెటిజన్లు, ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై గరంగరం అవుతున్నారు.
Anyone worried about the exploding bus on Lambeth Bridge just now? It was just for a movie. pic.twitter.com/1ypWZZ6jPp
— Nigel Huddleston MP (@HuddlestonNigel) February 7, 2016