
మాజీ ప్రధాని కుమారుడికి జైలు శిక్ష!
ఢాకాః బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడికి జైలు శిక్ష పడింది. మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన తరిక్ రెహెమాన్ కు ఏడు సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది.
నగదు బదిలీ విషయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నేషనల్ పార్టీ అధినేత్రి ఖలేదా జియా కుమారుడు.. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్.. తరిక్ రెహెమాన్ కు హైకోర్డు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 20.14 కోట్ల టాకాల మనీ లాండరింగ్ కేసు విషయంలో ట్రయల్ కోర్టు విచారణను తోచిపుచ్చిన హైకోర్టు.. విచారణ చేపట్టి రెహమాన్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 200 మిలియన్ల టాకాల జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది.