ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు! | Man charged over malicious messages to British lawmaker | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు!

Published Mon, Dec 7 2015 9:53 AM | Last Updated on Thu, Jul 26 2018 12:57 PM

ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు! - Sakshi

ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు!

లండన్: ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు ఆదివారం రాత్రి  అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు.

హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి. గత గురువారం నాడు వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని ఆదివారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement