అమెరికా దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. హఫీజ్ సంస్థలకు బయట ఆర్థిక మూలాలను అడ్డకుంటూ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదంతోపాటు హఫీజ్ కార్యకలాపాలను అడ్డుకోకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు నిధులను నిలిపివేసింది. దీంతో దిక్కుతోచని పాక్, హఫీజ్‌కు చెందిన సంస్థల ఆర్థిక మూలాలకు అడ్డకట్టవేసింది.
హఫీజ్ సయీద్‌కు చెందిన సంస్థలకు విరాళాలిస్తే జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుందని పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ వెల్లడించింది. సయీద్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-దవా(జేయూడీ), ఫలాఫ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్‌ఐఎఫ్) సంస్థలతో పాటు మొత్తం 72 సంస్థలపై నిషేధం విధిస్తూ బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చుతున్నట్లు పాక్ ప్రకటించింది. ఈ సంస్థలకు ఎవరైనా ఆర్థికంగా విరాళాలు అందజేస్తే 10ఏళ్ల జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా ఎరుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అక్రమంగా ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇవ్వడం నేరంగా పరిగనిస్తున్నామని ప్రకటిస్తూ పాక్‌లోని అన్ని మీడియా సంస్థలతో పాటు, పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా సయీద్‌కు చెందిన జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్ సంస్థల ఆస్తులను జప్తు చేసేందుకు పాక్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఉగ్రవాదుల నియంత్రణకు అమెరికా ప్రతి ఏడాది పాక్‌కు సుమారు దాదాపు రూ.7,290 కోట్లు (1.15 బిలియన్ డాలర్ల) భద్రత సాయాన్ని అందిస్తోంది. అయితే ఉగ్ర నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో పాక్‌కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment