
ఇస్లమాబాద్ : అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు మారో షాక్ ఇచ్చింది. పనామా పేపర్ల లీకేజీలో పదవి కోల్పోయిన నవాజ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అవినీతి నిరోధక కోర్టు విచారణ చేస్తోంది. తాజాగా లాహోర్ అవినీతి నిరోధక కోర్టు.. నవాజ్ షరీఫ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నవాజ్ భార్య.. కుల్సుమ్ కొంత కాలంగా లండన్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. నవాజ్ షరీష్‌కు జారీ అయిన అరెస్ట్ వారెంట్లకు బెయిల్ తీసుకునే అవకాశం ఉందని తయన తరఫు న్యాయవాది జాఫిర్ ఖాన్ తెలిపారు.