'పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం' | Pathankot terror attack disturbed India-Pakistan talks, Nawaz Sharif says | Sakshi
Sakshi News home page

'పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం'

Published Sat, Jan 30 2016 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

'పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం'

'పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం'

లాహోర్: పఠాన్కోట్ ఉగ్రదాడి ఘటన.. భారత్, పాకిస్థాన్ శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలు సరైన దిశలో సాగుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి ఘటన జరగడం ప్రతికూల ప్రభావం చూపించిందని షరీఫ్‌ అంగీకరించారు. పాకిస్థాన్ రేడియా ఈ విషయాలను వెల్లడించింది.

పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు పాక్ ఓ ఉన్నతస్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన దౌత్య చర్చలు వాయిదా పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement