
రికార్డు ఉష్ణోగ్రత... పరిశోధకుల ఆందోళన
ఓస్లో: వాతావరణ మార్పుల మూలంగా ధృవప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిశోధకులను కలవరపెడుతున్నాయి. ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసెర్చ్ సెంటర్ ఎస్పరాంజా బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాంతంలోని వాండా స్టేషన్లో1982 జనవరి 5న నమోదైన 15 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్డును ఇది అదిగమించింది.
ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమిపై వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థలో ప్రముఖ పరిశోధకుడు మైఖేల్ స్పారో వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటికాలో ఉన్న మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.