‘తాపి’ పైప్‌లైన్ పనులకు శ్రీకారం
మేరీ(తుర్క్‌మెనిస్తాన్): తుర్క్‌మెనిస్తాన్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా(టీఏపీఐ-తాపి) తాము చేపడుతున్న సహజవాయువు సరఫరా పైప్‌లైన్ పనులను మేరీలో ప్రారంభించాయి. తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు బంగురే, అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, భారత ఉపరాష్ట్రపతి అన్సారీ పాల్గొని వెల్డింగ్ పనులకు ప్రారంభించారు. సహజవాయు సరఫరాకుగాను 1,800 కి.మీ. పైపులైన్‌ను రూ. 51 వేల కోట్లతో నిర్మించనున్నారు. 2019 డిసెంబరు కల్లా పూర్తిచేసి దీని ద్వారా రోజుకు 9 కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు (ఎంఎంఎస్ సీఎండీ) 30 ఏళ్లపాటు భారత్, పాక్, అఫ్ఘాన్‌లకు తుర్‌మెనిస్తాన్ పంపిణీ చేయనుంది.