మెల్‌బోర్న్: అంతర్జాతీయ బానిసల సూచిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బానిసలు మనదేశంలోనే ఎక్కువని, లక్షలాది పిల్లలు సహా మొత్తం 1.43 కోట్ల మంది భారతీయులు ఆధునిక తరహా బానిసత్వం చిక్కుకున్నారని అంతర్జాతీయ బానిసత్వ సూచి(జీఎస్‌ఐ)-2014 పేర్కొంది. వీరు అక్రమరవాణా, వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీ బాధితులనని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో 3.5 కోట్ల మంది బానిసలు ఉండగా, వారిలో 45 శాతం భారత్, పాక్‌లో ఉన్నారని పేర్కొంది.