వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ప్రజలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజురోజుకు అక్కడ కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీరిలో 1,28,061 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 5,15,600 దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిచింది. (కరోనా: మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్)
అయితే ఈ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం బహిరంగ సభలని అమెరికా నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల మే నెలలో జరిగిన మెమోరియల్ డే వేడుకల్లో అమెరికా ప్రజలు వేలల్లో పాల్గొనడం వల్లే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జూలై 4న అమెరికా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకలో అమెరికన్లు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమం అనంతరం సందర్శకులను 14 రోజుల క్వారంటైన్‌కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లోని రెస్టారెంట్లలో ఇండోర్ భోజనాన్ని నిలిపివేశారు. న్యూయార్క్‌లో రెస్టారెంట్లను మూసివేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment