జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా 81.07 లక్షల మేరకు కోవిడ్ -19 కేసులు నమోదు కావడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన రెండు వారాలుగా ప్రతి రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను నియంత్రించిన దేశాలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ప్రపంచ దేశాలకు సూచించింది. "ప్రపంచ వ్యాప్తంగా లక్ష కేసులు నమోదవడానికి సుమారు రెండు నెలల కాలం పట్టింది. కానీ, ఇప్పుడు ప్రతి రోజూ లక్షకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ)
గడిచిన రెండు నెలలపాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని చైనా రాజధాని బీజింగ్‌లో తాజాగా రెండు కేసులు వెలుగు చూడగా, అందుకు తలెత్తిన కారణాలను విశ్లేషిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్ విషయానికొస్తే జనవరి 30న దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి మే 13 నాటికి ఈ సంఖ్య లక్షకు చేరుకుంది. లక్ష కేసులు నమోదవడానికి 109 రోజుల సమయం పట్టింది. కానీ తర్వాత కేవలం 15 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. అంటే జూన్ 2 నాటికి 2 లక్షల మార్క్‌ను సులువుగా దాటేసింది. అనంతరం పదంటే పది రోజుల్లోనే భారత్ మూడు లక్షలు దాటడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. (కరోనాపై తొలిసారిగా సర్వే)
Comments
Please login to add a commentAdd a comment