AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌ | Andhra Pradesh Assembly Elections 2024 Voting Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయి దాడులు చేశారు: సజ్జల

  • అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు
  • తెలుగుదేశం మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు
  • వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు
  • పేద ప్రజల అభివృద్దే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది
  • చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు దాడులు ప్రారంభించారు
  • టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో ఏకపక్షంగా దాడులకు తెగబడ్డారు
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయి
  • టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు
  • కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్‌ డే వరకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూడా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు
  • టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది
     
2024-05-13 20:20:24

పెద్ద సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది: ఏపీ సీఈవో

  • సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం
  • కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం
  • పల్నాడు జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి
  • పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు
  • ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది
  • ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించాం
  • కొన్ని చోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది
  • 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు
  • ఎక్కడా రీ పొలింగ్‌ అవసరం పడలేదు
  • కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం
  • ఇప్పటివరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది
  • స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుంది
     
2024-05-13 19:39:55

దాచేపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

పల్నాడు:

  • దాచేపల్లిలో పేట్రేగిపోయిన టీడీపీ మూకలు
  • పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడ్డ టీడీపీ గూండాలు
  • రెండు షాపులు, నాలుగు బైక్‌లు  దగ్ధం.. పలువురికి గాయాలు

 

 

2024-05-13 19:00:31

క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

ఇప్పటివరకూ ఏపీలో 75 శాతం పోలింగ్‌ నమోదు

2024-05-13 18:56:16

ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్‌

సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్‌ నమోదు
ఇంకా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
ఏపీలో పలుచోట్ల భారీగా క్యూలైన్లు
సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
 

2024-05-13 18:16:17

ఏపీలో 5 గంటల వరకూ 67.99 శాతం పోలింగ్‌ నమోదు

  • అల్లూరి     55.17
  • అనకాపల్లి     65.97
  • అనంతపురం 68.04
  • అన్నమయ్య 67.63
  • బాపట్ల 72.14
  • చిత్తూరు 74.06
  • కోనసీమ 73.55
  • తూ.గో 67.93
  • ఏలూరు 71.10
  • గుంటూరు 65.58
  • కాకినాడ 65.01
  • కృష్ణా 73.53
  • కర్నూలు 64.55
  • నంద్యాల 71.43
  • ఎన్టీఆర్ 67.44
  • పల్నాడు 69.10
  • పార్వతిపురం మన్యం 61.18
  • ప్రకాశం 71
  • నెల్లూరు 69.95
  • సత్యసాయి 67.16
  • శ్రీకాకుళం 67.48
  • తిరుపతి 65.88
  • విశాఖ 57.42
  • విజయనగరం 68.16
  • ప.గో 68.98
  • కడప 72.85
     
2024-05-13 17:51:46

మాచర్లలో ఘర్షణలను ప్రేరేపించింది టీడీపీనే: మల్లాది విష్ణు

  • పోలీస్‌ అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు
  • కుప్పం, మాచర్ల, తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
  • వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి మాపైనే ఫిర్యాదులు
     
2024-05-13 17:15:48

మాచర్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి కుమారుడిపై టీడీపీ నేతల దాడి
  • పాల్వాయి గేట్‌లో టీడీపీ నేతలు ఓటర్లను అడ్డుకున్నారు
  • విషయం తెలిసి పాల్వాయి గేట్‌ వద్దకు వెళ్లాం: గౌతంరెడ్డి
  • పిన్నెల్లిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు
  • అడ్డుకున్న మాపై విచక్షణారహితంగా దాడి చేశారు
  • టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు మాపై దాడి చేశారు
  • దాడి జరిగినా కారంపూడి సీఐ స్పందించలేదు
     
2024-05-13 17:13:55

పోరంకిలో టీడీపీ గూండాల దాడి

కృష్ణా:

  • దొంగ ఓట్లు వేయడాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • ప్రశ్నించిన జోగి రమేష్‌ అనుచరుడిపై కర్రలతో దాడి
  • ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌పై టీడీపీ నేత దాడి
  • ఎమ్మెల్యేగా మాల, మాదిగ వర్గాలకు కొమ్ము కాస్తున్నారంటూ గొట్టి ముక్కల సుధాకర్‌ దూషించాడు: అన్నా బత్తుని శివకుమార్‌
  • నా భార్య ఎదుటే అసభ్యంగా దూషించాడు
  • బూత్‌లోకి వెళ్తుండగా తిడుతూనే ఉన్నాడు
  • నువ్వు అసలు కమ్మవాడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడు
  • పోలింగ్‌ బూత్‌ వద్ద మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు
  • పోలింగ్‌ బూత్‌ వద్ద దౌర్జన్యం చేస్తున్నట్లు ఓటర్లే చెప్పారు
  • టీడీపీ, జనసేన నేతలు వేరే ప్రాంతాల నుంచి వాళ్ల మనుషులను దింపారు
  • వైఎ‍స్సార్‌సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు
     
2024-05-13 17:07:16

అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యం

  • ఉదయం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
  • అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పై మరోసారి దాడి చేసిన టీడీపీ శ్రేణులు
  • తీవ్ర గాయాలు కావడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను 108లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
2024-05-13 16:40:04

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నమోదవుతున్న పోలింగ్‌

  • 3 గంటలకు 55.49 శాతం మేర పోలింగ్ నమోదు.
  • ఓటుహక్కు వినియోగించుకున్న 2 .3 కోట్ల మంది
  • అల్లూరి     48.87
  • అనకాపల్లి     53.45
  • అనంతపురం 54.25
  • అన్నమయ్య 54.44
  • బాపట్ల 59.49
  • చిత్తూరు 61.94
  • కోనసీమ 59.73
  • తూ.గో 52.32
  • ఏలూరు 57.11
  • గుంటూరు 52.24
  • కాకినాడ 52.69
  • కృష్ణా 59.39
  • కర్నూలు 52.26
  • నంద్యాల 59.30
  • ఎన్టీఆర్ 55.71
  • పల్నాడు 56.48
  • పార్వతిపురం మన్యం 51.75
  • ప్రకాశం 59.96
  • నెల్లూరు 58.14
  • సత్యసాయి 57.56
  • శ్రీకాకుళం 54.87
  • తిరుపతి 54.42
  • విశాఖ 46.01
  • విజయనగరం 54.31
  • ప.గో 54.60
  • కడప 60.57
2024-05-13 16:06:07

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు

పల్నాడు జిల్లా:

  • రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూత్‌లు
  • 203,204,205,206,207,208 నెంబర్లతో బూతులు ఏర్పాటు చేసిన అధికారులు
  • 203,204,206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలు పగలగొట్టిన తెలుగుదేశం నాయకులు
  • 205 నెంబర్ బూతులో స్వల్పంగా పగిలిన ఈవీఎం
  • దీంతోపాటు జెట్టిపాలెంలో 215 బూత్‌లో మరొక ఈవీఎంని పగలగొట్టిన టీడీపీ నాయకులు
  • తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్ లో రెండు గంటల నుంచి నిలిచిపోయిన పోలింగ్
  • కారంపూడి మండలం ఒప్పిచర్ల పెద్ద హైస్కూల్లో బూత్‌ నెంబర్ 251 లో పగలగొట్టిన టీడీపీ నాయకులు
2024-05-13 15:59:31

ఏపీలో కొనసాగుతున్న పోలింగ్‌.. 55 శాతం నమోదు

  • మధ్యాహ్నం మూడు గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదు. 
  • పలుచోట్ల ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు. 
  • అల్లూరి జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకు ముగియనున్న పోలింగ్‌
  • పాడేరులో ఉరుములతో కూడిన భారీ వర్షం. 
  • విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పోలింగ్‌కు తీవ్ర అంతరాయం. 
     
2024-05-13 15:33:36

దొంగ ఓట్లు వేయిస్తున్న టీడీపీ అభ్యర్థి బోడే..

  • కృష్ణా జిల్లా..
  • దగ్గరుండి దొంగ ఓట్లు వేపిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్..
  • పడమట నుంచి పోరంకి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ వ్యక్తులు.
  • దొంగ ఓటు వేసిన వ్యక్తిని పట్టుకొని నిలదీసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
  • టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారని వివరించిన దొంగ ఓటర్లు.
2024-05-13 15:26:36

గొట్టిముక్క‌ల సుధాక‌ర్‌పై అన్నాబుత్తుని శివకుమార్‌ తీవ్ర ఆరోపణలు..

  • అన్నాబత్తుని శివకుమార్‌ కామెంట్స్‌..
  • తెనాలి ఐతాన‌గ‌ర్‌లో నా భార్య‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లాం.
  • ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్క‌ల సుధాక‌ర్ దుర్భాష‌లాడాడు
  • వైయ‌స్సార్‌పార్టీపై చాలా ద్వేషంతో ర‌గిలిపోయాడు
  •  చాలా శాడిజంగా దుర్భాష‌లాడాడు
  •  నా భార్య ముందే న‌న్ను అస‌భ్యంగా దూషించాడు
  • బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు.. వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు
  •   గొట్టిముక్క‌ల సుధాక‌ర్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ వ్య‌క్తి
  •   నువ్వు అస‌లు క‌మ్మోడివేనా అంటూ అస‌భ్యంగా మాట్లాడాడు
  •  పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు
  •  పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుండి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ట్లు అక్క‌డి ఓట‌ర్లే చెప్పారు
  • అత‌డు బెంగళూరులో ఉంటూ ఇక్క‌డ‌కు వ‌చ్చి హ‌డావిడి చేశాడు
  • టీడీపీ, జనసేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి మా ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నారు
2024-05-13 15:13:00

వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తల దాడి

  • వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తల దాడి
  • గూడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళిపై దాడి
  • వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
  • 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 
     
2024-05-13 14:55:27

మారణాయుధాలతో దాడి చేశారు: పిన్నెల్లి గౌతమ్‌ రెడ్డి

  • పల్నాడు జిల్లా
  • మాచర్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి
  • గౌతమ్‌ రెడ్డి కామెంట్స్‌..
  • ఉదయం నుంచి పాల్వాయి గేట్ ఊరిలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారు
  • విషయం తెలుసుకుని మా నాన్న రామకృష్ణారెడ్డితో కలిసి పాల్వాయి గేటు వద్దకు మేం వెళ్ళాం
  • ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రౌడీలాగా ప్రవర్తిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారు
  • మేం అడ్డుకోవడంతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు
  • మారణాయుధాలతో దాడి చేశారు
  • నాతోపాటు కార్యకర్తల తలలు పగిలాయి
  • మాపై దాడి చేసిన వారిలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు
  • ఇంత జరుగుతున్నా కారంపూడి సీఐ నారాయణ స్వామి స్పందించలేదు
     
2024-05-13 14:16:07

రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు..

  • తిరుపతిలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌
  • టీడీపీ, వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • రంగ ప్రవేశం చేసిన కేంద్ర బలగాలు
  • ఒకసారి గాల్లోకి కాల్పులు జరిపిన కేంద్ర బలగాలు. 
2024-05-13 14:09:45

పోలింగ్‌ బూత్‌లో గంటా బరితెగింపు..

  • గంట శ్రీనివాసరావు ఓవరాక్షన్‌..
  • పోలింగ్ బూతులోకి ఓటర్లను ప్రలోభపెట్టిన గంటా..
  • ఏకంగా పార్టీ కండువా వేసుకొని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన గంటా. 
2024-05-13 14:00:24

గుంటూరులో టీడీపీ నేతల అత్యుత్సాహం

  • గుంటూరు..
  • గుంటూరు రాయపాటి వీరయ్య చౌదరి ప్రాథమిక పాఠశాల బూతులో దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ ప్రయత్నం
  • సమాచారం తెలిసి అడ్డుకునేందుకు వెళ్లిన వైస్సార్‌సీపీ  అభ్యర్థి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
  • ఇద్దరిపై దూషణలకు దిగిన టీడీపీ కార్యకర్తలు
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
  • రంగంలోకి దిగి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపిన పోలీసులు. 
     
2024-05-13 13:55:13

టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌..

  • అనకాపల్లి నర్సీపట్నంలో పచ్చ బ్యాచ్‌ ఓవరాక్షన్‌.  
  • టీడీపీ కార్యకర్తల బరితెగింపు..
  • నర్సీపట్నంలో టీడీపీ, బీజేపీ గుర్తులతో స్లిప్పులు పంపిణీ.
  • అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.
  • ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మీ అంతు చూస్తామంటూ బెదిరింపులు.
2024-05-13 13:44:15

కొనసాగుతున్న పోలింగ్‌.. ఇప్పటి వరకు 36 శాతం

  • ఏపీలో పోలింగ్‌ కొనసాగుతోంది. 
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం పోలింగ్‌ నమోదు
  • ఇంకా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరని ఓటర్లు. 
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. 
     
2024-05-13 13:34:44

ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ నేతలు..

  • వైఎస్సార్‌ జిల్లా..
  • పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైయస్ భాస్కర్ రెడ్డి.
  • ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.
  • భాకరాపురంలోని 138వ పోలింగ్ బూత్‌లో ఓటు
  • పులివెందులలో ఓటు వేసిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
     
  • కృష్ణా జిల్లా
  • ఓటు హక్కు వినిగించుకున్న మంత్రి జోగి రమేష్‌.
  • యనమలకుదురులోని బూత్ నెంబర్ 67లో ఓటు హక్కును జోగి రమేష్, కుటుంబ సభ్యులు
  • జోగి రమేష్‌ కామెంట్స్..
  • రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది.
  • అన్ని వర్గాల ప్రజలు జగనన్న వలన లబ్ధి పొందారు.
  • ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  • చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారు.
  • పిఠాపురంలో పవన్‌కు డిపాజిట్ కూడా రాదు.
  • జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం
     
2024-05-13 13:28:02

కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌​..

  • కర్నూలు..
  • కర్నూలు బీ క్యాంప్ 72 పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.
  • టీడీపీ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న కానిస్టేబుల్.
  • కానిస్టేబుల్ వ్యవహారంపై చర్యలు తీసుకొవాలని స్థానికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్‌. 
2024-05-13 13:19:37

వైఎస్సార్‌సీపీ బదులు టీడీపీకి ఓటు అంగన్‌వాడీ నిర్వాకం..

  • తూర్పుగోదావరి జిల్లా..
  • నల్లజర్ల మండలం సుభద్రపాలెంలో అంగన్‌వాడీ టీచర్ నిర్వాకం
  • సుభద్రపాలెంలోని 127 నెంబర్ బూత్‌లో ఒక దివ్యాంగురాలితో ఓటు వేయించిన అంగన్వాడీ టీచర్
  • ఫ్యాన్ గుర్తుకు బదులుగా సైకిల్‌కు, కమలానికి ఓట్లు వేయించడంతో బయటికి వచ్చి ఏడ్చిన దివ్యాంగురాలు
  • దీంతో బయటపడిన అంగన్వాడి టీచర్ నిర్వాకం
  • అంగన్‌వాడీ టీచర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించిన అధికారులు
2024-05-13 13:10:17

ఓటు వేసిన పేర్ని నాని కుటుంబ సభ్యులు

  • మచిలీపట్నంలో ఓటు వేసిన పేర్ని నాని
  • ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్ని కిట్టూ 
  • కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నాని 
  • పేర్ని నాని కామెంట్స్‌
  • గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ శాంత పెరుగుతోంది. 
2024-05-13 12:55:00

టీడీపీ నేతల కవ్వింపులు..

  • కృష్ణా జిల్లా..
  • గన్నవరం మండలం సూరంపల్లి వద్ద ఉద్రిక్తత.
  • టీడీపీ నేత జాస్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలు.
  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ కారుని అడ్డుకునే ప్రయత్నం.
  • ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.
  • ఇరు వర్గాల మధ్య తోపులాట.
  • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
2024-05-13 12:48:25

రెచ్చిపోయిన అయ్యన్న..

  • నర్సీపట్నం..
  • మరోసారి అధికారులపై బూతులతో రెచ్చిపోయిన అయ్యన్న..
  • చెప్పరాని భాషలో అధికారులపై విరుచుకుపడ్డ అయ్యన్న..
  • పనికిమాలిన సన్నాసి కొడుకు అంటూ ఆర్‌డీఓపై నోరు పారేసుకున్న అయ్యన్న..
  • అధికారులపై బూతు పురాణం..
  • అయ్యన్న తీరును చూసి అసహ్యించుకున్న ప్రజలు..
  • అయ్యన్నది ఇదేం బాషా అంటూ మండిపడుతున్న ప్రజలు, ఉద్యోగులు..
2024-05-13 12:39:41

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై టీడీపీ నేతల దాడి..

  • పల్నాడు జిల్లా
  • మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ దాడి
  • కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో టీడీపీ కార్యకర్తలు దాడి
  • పది మంది వైఎస్సార్‌సీప కార్యకర్తలకు తీవ్ర గాయాలు
  • తలలు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావం
  • రోడ్డుపైన పడిపోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
  • రామకృష్ణారెడ్డి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం
  • పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా రామకృష్ణ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ శ్రేణులు. 
     
2024-05-13 12:34:29

తాడిపత్రిలో ఉద్రిక్తత

  • అనంతపురం..  
  • తాడిపత్రిలో ఉద్రిక్తత
  • పోలీసుల లాఠీచార్జి
  • తాడిపత్రిలో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం
  • అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవి
  • ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • తాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపు
  • లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
2024-05-13 12:28:25

ఓటు వేసిన ఎమ్మెల్యే కన్నబాబు..

  • కాకినాడ
  • ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. 
  • కాకినాడ రూరల్ రమణయ్య పేటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు
2024-05-13 12:09:09

విశాఖలో పలువురు అరెస్ట్‌..

  • విశాఖ వెస్ట్ పోలీసుల అదుపులో పది మంది అనుమానితులు.
  • ఓటర్లను ప్రలోభ పెడుతూన్నారని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విశాఖ వెస్ట్
  • విశాఖ వెస్ట్ 52వ వార్డు కరాస ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు తీసుకొచ్చిన బౌన్సర్లు ఓటర్లకు ప్రలోభాలు. 
  • పదిమంది బౌన్సర్లను అదుపులోకి తీసుకున్న వెస్ట్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి
     
2024-05-13 12:00:27

టీడీపీ ప్రలోభాలు..

  • కృష్ణా జిల్లా..
  • పెనమలూరు నియోజకవర్గం  పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ
  • టీడీపీకి ఓటు వేయాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలు
  • టీడీపీ ప్రలోభాలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
  • టీడీపీపై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.
2024-05-13 11:57:25

ఇప్పటి వరకు 24 శాతం పోలింగ్‌..

  • అమరావతి
  • ఇప్పటి వరకు 24 శాతం మేర పోలింగ్ నమోదు.
  • 24.17 శాతం మేర ఓటేసిన మహిళలు.
  • 23.68 శాతం మేర ఓటేసిన పురుషులు.
  • ఇప్పటి వరకు  ఓటు హక్కు వినియోగించుకున్న కోటి మంది ఓటర్లు
     
2024-05-13 11:39:33

సీఈవో మీనాపై దీపక్‌ మిశ్రా ఆగ్రహం

  • అమరావతి
  • పోలింగ్ సరళిని పరిశీలించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా.
  • హింసాత్మక ఘటనలు జరగ్గకుండా చూడాలన్న దీపక్ మిశ్రా.
  • పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించిన మిశ్రా.
  • ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని వివరించిన సీఈఓ ఎంకే మీనా.
  • 42 వేల సీసీ కెమెరాలు పెట్టినా హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయంటూ ఆగ్రహం.
  • ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన దీపక్ మిశ్రా.
  • హింసాత్మక ఘటనలు జరిగిన మరో ఐదు ప్రాంతాల్లోని పరిస్థితి నివేదికవ్వాలన్న మిశ్రా.
2024-05-13 11:35:46

కుప్పం అధికారుల నిర్లక్ష్యం..

  • చిత్తూరు జిల్లా
  • కుప్పంలో పోలింగ్ అధికారులు నిర్లక్ష్యం
  • తనిఖీ లేకుండా పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు అనుమతి  
  • సైకిల్‌కు ఓటును వేసిన వీడియో తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్న ఓటర్.
     
2024-05-13 11:28:28

నందిగామ సురేష్‌పై దాడియత్నం..

  • బాపట్ల జిల్లా
  • పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకం
  • బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడి
  • దాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్
  • ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్‌ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలు
  • ఏజెంట్లను బెదిరించిన టీడీపీ కార్యకర్తలు
  • మూడురోజుల క్రితమే యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సురేష్‌పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు
     
2024-05-13 11:23:28

తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

అనంతపురం:  

  • తాడిపత్రిలో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం
  • అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవి
  • ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • తాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపు
  • లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
2024-05-13 11:14:10

జనసేన కార్యకర్తల బూత్‌ రిగ్గింగ్

కృష్ణా జల్లా:

  • మోపిదేవి మండలం అడపావారిపాలెం 131వ పోలింగ్ బూత్ సమీపంలో ఘర్షణ
  • జనసేన కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడడం, వృద్దులను తీసుకెళ్ళి వాళ్లే ఓటు వేయడంతో మొదలైన వివాదం
  • కళ్లేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిపై దాడి
  • తన కుమారునిపై దాడి చేయడంతో ఆవేదన వ్యక్తం చేసిన రాజశేఖర్ తల్లి
  • జనసేన పార్టీ నాయకులు వైసీపీకి ఓటు వేయొద్దని పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న గ్రామస్తులు
  • రంగంలోకి దిగిన పోలీసులు
     
2024-05-13 11:10:50

క్యూలైన్‌లో ఓటర్లు.. పోలింగ్‌ ఎంత శాతమంటే?

  • ఉదయం 10 గంటల వరకు 15.2 శాతం పోలింగ్‌ నమోదు
  • గాజువాకలో పెద్ద సంఖ్యలో పోలింగ్‌ నమోదు అవుతోంది.
2024-05-13 11:01:35

ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

  • ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి
  • శ్రీకాకుళంలో కొనసాగుతున్న పోలింగ్‌
  • ఓటు వేసిన మంత్రి ధర్మన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పలువురు నేతలు
  • సత్తెనపల్లిలో ఓటు వేసిన అంబటి రాంబాబు
  • గాజువాకలో ఓటు వేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌
  • ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. 
  • విజయనగరంలో ఓటు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
     
2024-05-13 10:52:40

టీడీపీ నేతల బూత్‌ రిగ్గింగ్‌..

  • పల్నాడు జిల్లా:
  • నూజెండ్ల మండలం జంగాలపల్లిలో తెలుగుదేశం నాయకులు బూత్‌ రిగ్గింగ్
  • సమాచారం తెలుసుకొని ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు
  • బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు
  • జంగాలపల్లిలో ఉద్రిక్తత
2024-05-13 10:46:13

ఓటు వేసిన మంత్రి రోజా...

  • తిరుపతి
  • నగరిలో ఓటు హాక్కు వినియోగించుకున్న ఆర్కే రోజా.
  • నగరి మున్సిపల్‌ పోలింగ్ బూత్‌లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రోజా.
  • మరోసారి ఫ్యాన్ గాలిబలంగా వీస్తుందన్న రోజా. 
2024-05-13 10:43:33

ఓటు వేసిన బాలకృష్ణ

  • ఓటు వేసిన టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ
  • హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ
2024-05-13 10:17:17

నిలిచిన పోలింగ్‌..

  • అనంతపురం:
  • ఉరవకొండ నియోజకవర్గం వై.రాంపురంలో ఓటర్లకు టీడీపీ నేతల బెదిరింపులు
  • టీడీపీకి ఓట్లు వేయకపోతే చంపుతామని రౌడీషీటర్ సుబ్బారాయుడు వార్నింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • వై.రాంపురం గ్రామంలో నిలిచిన పోలింగ్
2024-05-13 10:04:55

ఓటర్లను బెదిరిస్తున్న పచ్చ బ్యాచ్‌

  • ప్రకాశం జిల్లా
  • దర్శి మండలం దేవవరం, కట్టుబడివారిపాలెంలో ఘర్షణ వాతావరణం
  • పోలింగ్ బూతుల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుపై టీడీపీ ఏజెంట్లు దాడి
  • గ్రామంలో ఓటర్లను బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు
  • ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసులు
2024-05-13 10:04:55

అందరూ ఓటు వేయండి: షేక్‌ అసిఫ్‌

  • ఎన్టీఆర్ జిల్లా
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ 199 బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ అసిఫ్
  • షేక్‌ అసిఫ్ కామెంట్స్
  • విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నాను
  • ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
  • పోలింగ్ బూత్‌లో ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారు
  • కానీ ఒక గంట సేపు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయి.  
  • అధికారులు వచ్చి సరి చేశారు మళ్లీ పోలింగ్ మొదలైంది
  • ఉదయం గంట లేటుగా మొదలు అయింది కాబట్టి సాయంత్రం గంట సేపు సమయం పెంచాలి అని కోరడం జరిగింది
2024-05-13 10:04:55

ఏపీలో కొనసాగుతున్న పోలింగ్‌

  • ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్‌ నమోదైంది. 
  • పలుచోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 
  • టీడీపీ నేతలు పటచోట్ల రెచ్చిపో​యి ఓవరాక్షన్‌కు దిగారు.
  • వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. 
2024-05-13 09:52:01

ఓటు వేసిన వంగా గీత.

  • పిఠాపరంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత
  • పిఠాపురం RRBHR హై స్కూల్‌లో పోలింగ్ సరళినీ పరిశీలించిన వంగా గీత.
  • 144 పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వంగా గీత, కుటుంబ సభ్యులు.
     
2024-05-13 09:45:23

కుప్పంలో దొంగ ఓటర్లు..

  • చిత్తూరు జిల్లా..
  • కుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లు..
  • కుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్
  • మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది.
2024-05-13 09:45:23

చింతమనేని అనుచరుల హల్‌చల్‌

  • ఏలూరు జిల్లా
  • దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టీడీపీ నాయకుల దౌర్జన్యం.
  • పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చేసిన చింతమనేని అనుచరులు.
  • ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లు
  • విధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నాయకులు
  • పారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.
2024-05-13 09:35:02

హిందూపురంలో ఉద్రిక్తత..

  • శ్రీ సత్యసాయి జిల్లా..
  • హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు
  • వైఎస్సార్‌సీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు
  • రెండు కార్లు ధ్వంసం
  • వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్‌కు తీవ్ర గాయాలు
2024-05-13 09:35:02

మాచర్లలో ఉద్రికత్త..

  • పల్నాడు జిల్లా
  • మాచర్ల మండలం రాయవరంలో ఉద్రిక్తత
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
  • ఓటర్లను టీడీపీ కార్యకర్తలు ప్రలోభాలకు గురిచేస్తుండగా ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు
  • ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు.
  • ఆస్పత్రికి తరలింపు
2024-05-13 09:25:12

టీడీపీ నేత హల్‌ చల్‌.. 

  • నంద్యాల జిల్లా..
  • నందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ చేశారు,
  • క్యూలైన్‌లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాలకు గురి చేశారు.
  • క్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,
  • ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డిని పోలీసులు 100 మీటర్లు బయటఉండాలని సూచించారు.
  • పోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించిన టీడీపీ నేత.
     
2024-05-13 09:25:12

పచ్చ నేతల ప్రలోభాలు..

  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. 
  • పోలింగ్‌ బూత్‌ల వద్ద పచ్చ నేతల ఓవరాక్షన్‌. 
  • భీమిలీ నియోజకవర్గం మధురవాడ బూత్‌ల వద్ద టీడీపీ మేనిఫెస్టో స్లిప్‌ల పంపిణీ. 
  • నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఏజెంట్ల ఓవరాక్షన్‌. 
2024-05-13 09:19:01

పచ్చ నేతల ప్రలోభాలు..

  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు. 

  • పోలింగ్‌ బూత్‌ల వద్ద పచ్చ నేతల ఓవరాక్షన్‌. 

  • భీమిలీ నియోజకవర్గం మధురవాడ బూత్‌ల వద్ద టీడీపీ మేనిఫెస్టో స్లిప్‌ల పంపిణీ. 

  • నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఏజెంట్ల ఓవరాక్షన్‌. 
     

2024-05-13 09:16:35

పల్నాడులో గొడవలపై ఈసీ ఆరా..

  • పోలింగ్‌కు ముందే పలు చోట్లు ఉద్రికత్తలు
  • వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశం
  • అవసరమైతే మరిన్ని బలగాలను పంపాలని ఈసీ నిర్ణయం 
  • గురజాలలో కూడా ఉద్రికత్తలు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
     
2024-05-13 09:11:14

ఓటు వేసిన పవన్‌ 

  • మంగళగిరి..
  • ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన పవన్‌ కల్యాణ్‌
  • మంగళగిరిలో ఓటు వేసిన పవన్‌, కుటుంబ సభ్యులు
2024-05-13 09:04:32

ఓటు వేసిన కామినేని కుటుంబ సభ్యులు..

  • విజయవాడ
  • ఓటు వేసిన కామినేని కుటుంబ సభ్యులు. 
  • కామినేని నగర్‌లో ఓటు వేసిన ఎంపీ కేశినేని నాని, కేశినేని శ్వేత, కుటుంబ సభ్యులు
2024-05-13 09:04:32

పోలీసుల అత్యుత్సాహం..

  • విశాఖపట్నం..
  • జీవీఎంసీ 14వ వార్డు సీతమ్మధార పోలింగ్ బూత్ నంబర్ 176,177, 178, 179, 180 వద్ద పోలీసుల అత్యుత్సాహం.
  • క్యూ కట్టలేక కూర్చున్న వృద్ధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఐ ఎస్ రమేష్.
  • ప్రశ్నించిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రమేష్.
  • పోలింగ్ బూత్‌ల వద్ద వికలాంగులకు, వృద్ధులకు వసతులు కరువు.
  • క్యూలైన్‌లో వేచి ఉంటున్న వృద్ధులు వికలాంగులు.
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు.
     
2024-05-13 08:59:47

విశాఖలో ఓటర్‌ చైతన్యం

  • విశాఖలో కొనసాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ‌
  • పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరిన ఓట‌ర్లు.. వెల్లివిరిసిన చైత‌న్యం
  • ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం... ఫ‌లించిన చ‌ర్య‌లు
  • నిర్ణీత స‌మ‌యానికి పోలింగ్ ఏజెంట్ల స‌మ‌క్షంలో ముగిసిన మాక్ పోలింగ్
  • క‌మాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున‌
  • జిల్లాలోని తాజా ప‌రిస్థితిని డ్యాష్ బోర్డు ద్వారా స‌మీక్షించిన జిల్లా క‌లెక్ట‌ర్
  • అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు
2024-05-13 08:52:47

పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు

  • కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం మేడపాడు లో 107 పోలింగ్ స్టేషన్ లో మొరాయించిన ఈ.వి.ఎం..
  • ఇంక ప్రారంభం కానీ పోలింగ్
2024-05-13 08:49:34

విజయనగరంలో దివ్యాంగ ఓటర్ల అవస్థలు

  • విజయనగరం జిల్లా వ్యాప్తం గా మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద మినహా మిగతా చోట్ల కనబడని వీల్ చైర్లు. 
  • ఓటు వేయడానికి అవస్థలు పడుతున్న దివ్యాంగులు
2024-05-13 08:47:27

ఓటసిన సజ్జల.. ఓటర్లు తరలి రావాలని పిలుపు

  • గుంటూరు పెదకాకాని మండలం కాజ గ్రామంలోని 131 వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
  • ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది: సజ్జల
  • మహిళలు, వృద్దులు, రైతులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ కోసం పొద్దున్నే వచ్చారు: సజ్జల
  • ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా: సజ్జల
2024-05-13 08:44:07

ఓటేసిన ఆళ్ల సోదరులు

  • పెదకాకాని 32 బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామ రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
2024-05-13 08:39:14

ఓటు వేసిన మంత్రి తానేటి వనిత.. 

  • తూర్పుగోదావరి జిల్లా..
  • కుటుంబ సభ్యులతో కలసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న హోం మంత్రి తానేటి వనిత.
  • గోపాలపురం నియోజకవర్గంలో ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత..
  • దేవరపల్లి మండలం యర్నగూడెం బూత్ నెంబర్ 88లో ఓటును వినియోగించుకున్న తానేటి వనిత.
  • హోం మంత్రి తానేటి వనితతో పాటు ఓటింగ్‌లో పాల్గొన్న భర్త తానేటి శ్రీనివాసరావు, కుమార్తె ప్రణవి..
  • వీల్ చైర్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న హోం మంత్రి తండ్రి జొన్నకూటి బాబాజీ రావు..
2024-05-13 08:35:10

బూత్‌ వద్దనే టీడీపీ ప్రచారం..

  • గుంటూరు..
  • పొన్నూరు నియోజకవర్గం పెదకాకానిలో పోలింగ్ బూత్ వద్దనే టీడీపీ కార్యకర్తల ప్రచారం
  • 26, 27వ నెంబర్ పోలింగ్ బూతుల వద్ద ఓటర్ స్లిప్పులతో పాటు టీడీపీ అభ్యర్థి పేరుతో ఉన్న స్లిప్పులు ఇస్తున్న టీడీపీ కార్యకర్తలు
2024-05-13 08:35:10

పోలీసుల తీరుపై ఎంపీ విజయసాయి అసహనం

  • నెల్లూరు
  • పోలీసుల తీరుపై నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అసహనం
  • నెల్లూరు రూరల్ నియోజకవర్గం వెంకటాయపాలెం పోలింగ్ బూత్ వద్ద పోలీసులు సరైన భద్రత కల్పించలేదని అసహనం
  • వెంటనే స్థానిక ఎస్పీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి
  • పోలీసులు తగినంత ఫోర్స్ ఇవ్వలేకపోతే మా సేవాదళ్ సభ్యులు వచ్చి పోలింగ్ వద్ద సేవలు అందిస్తారని ఎస్పీకి చెప్పిన విజయసాయి
  • సరిపడేంత ఫోర్స్ లేదని ఒప్పుకున్నా ఏసీపీ
  • వెంటనే ఘటనా స్థలానికి నెల్లూరు స్థానిక ఎస్పీ.
     
2024-05-13 08:27:17

సాంకేతిక సమస్యలు పెద్దగా లేవు: కలెక్టర్ ఢిల్లీరావు

  • విజయవాడ
  • విజయవాడ నగరంలో పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ ఏర్పాట్లని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
  • కలెక్టర్ ఢిల్లీరావు కామెంట్స్‌..
  • ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది
  • జిల్లా వ్యాప్తంగా 1792 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైంది
  • ఎక్కడా సాంకేతిక సమస్యలు పెద్దగా ఎదురుకాలేదు
  • ఈవీఎం సాంకేతిక సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఇంజనీర్లని ఏర్పాటు చేశాం
  • జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది
  • గత ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లాలో 79 శాతం పోలింగ్‌ నమోదైంది
  • ఈసారి 85 శాతం పోలింగ్ లక్ష్యంగా నిర్ణయించుకున్నాం
  • పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకే నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ని గ్రీన్ పోలింగ్ కేంద్రంగా తయారు చేశాం
  • ఈ గ్రీన్ పోలింగ్ కేంద్రంలో చలవ పందిళ్లు, మట్టి కుండలులో తాగునీరు, పుజల మొక్కలతో అలంకరణ చేశాం
2024-05-13 08:22:21

వారిపై చర్యలు తీసుకుంటాం: ముఖేష్‌ కుమార్‌ మీనా

  • సీఈవో ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌..
  • ఏపీవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది
  • ఉదయం ఆరేడు చోట్ల కొన్ని హంసాత్మక సంఘటనలు జరిగాయి
  • పల్నాడు, శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలు జరిగాయి.
  • ఎవరికీ తీవ్ర గాయాలు కలుగలేదు
  • పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు
  • హింసాత్మక ఘటనలకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించాం
  • ఏజెంట్ల షర్ట్ కలర్ మీద ఎలాంటి ఆంక్షలు లేవు.
  • సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వున్నాయి.
  • ఏ కలర్ చొక్కావేసుకోవాలనేది వారి ఇష్టం.
  • చొక్కా కలర్ ఓటర్‌ని ప్రభావితం చేయదు.
  • నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నా. ఈ కలర్ ఎవరినీ ప్రభావితం చేయదు.
     
2024-05-13 08:16:57

టీడీపీ అభ్యర్థి రౌడీయిజం..

  • చిత్తూరు జిల్లా
  • జీ.డి .నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి థామస్ రౌడీయిజం
  • 50 మంది చెన్నైకి చెందిన  ప్రవేట్ బౌన్సర్లుతో ఓటర్లకు బెదరింపులు
  • కార్వేటి నగరం మండలం అన్నూరు వద్ద ప్రైవేట్ బౌన్సర్లను అడ్డుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
  • ఓటర్లను భయపెడుతున్న బౌన్సర్లు.
  • ఓవరాక్షన్‌ను పట్టించుకోని పోలీసులు, ఎన్నికల అధికారులు
2024-05-13 08:11:56

ఓటు వేసిన ముద్రగడ

  • కాకినాడ
  • ఓటు హక్కు వినియోగించుకు​న్న ముద్రగడ కుటుంబ సభ్యులు
  • జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఓటు హక్కును వినియోగించుకున్న ముద్రగడ కుటుంబం
     
2024-05-13 08:06:31

ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు

  • విజయవాడ
  • విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేసిన ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు
  • విజయవాడలోని రైల్వే కళ్యాణ మండపంలోని 155 పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు
     
2024-05-13 07:59:40

ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు

  • ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
  • కుటుంబ సభ్యులు కలిసి ఓటు వేసిన చంద్రబాబు.
  • ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు, భువనేశ్వరి. 
     
2024-05-13 07:53:25

ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి

  • వైఎస్సార్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీ వాణీ కామెంట్స్‌
  • వరుణదేవుడు కూడా మాకు సపోర్ట్‌గా ఉన్నాడు.. 
  • వాతావరణం అనుకూలంగా ఉంది
  • గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది
  • మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది
     
2024-05-13 07:44:49

ఓటు వేసిన సీఎం జగన్‌

  • ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. 
  • కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌
  • 138వ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన ముఖ్యమంత్రి జగన్‌
     
2024-05-13 07:42:03

ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ నేతలు..

  • నెల్లూరు జిల్లా
  • పొదలకూరు మండలం తోడేరులో కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • మంత్రి కాకాణి కామెంట్స్
  • రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి
  • వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి సీఎం జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
  • సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు
  • రెండు సార్లు నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోవసారి కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు
     
2024-05-13 07:35:43

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. ప్రారంభం కాని పోలింగ్‌..

  • వైఎస్సార్ జిల్లా
  • ప్రొద్దుటూరు టౌన్ 138 బూత్‌లో మొరాయించిన  ఈవీఎంలు
  • ఇంకా ప్రారంభంకాని పోలింగ్

 

  • నెల్లూరు..
  • రూరల్ నియోజకవర్గ పరిధిలోని  కొండాయపాలెం బూత్ నంబర్ 191లో ఈవీఎం మోరాయింపు.
  • క్యూ లైన్‌లో  ఉన్న  నరసరావుపేట వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు.

 

  • అన్నమయ్య జిల్లా..
  • పుల్లంపేటలో మొరాయించిన ఈవీఎం.
  • 183 పోలింగ్ స్టేషన్‌లో సాంకేతిక లోపంతో పనిచేయని ఈవీఎం.
  • 7 గంటలకు మొదలవ్వాల్సిన పోలింగ్ ఆలస్యం.

 

  • కృష్ణాజిల్లా ..
  • కంకిపాడు మండలం నెప్పల్లిలో 266 బూత్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రారంభం కాని పోలింగ్
2024-05-13 07:28:44

పోలింగ్ సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌..

పోలింగ్ సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌.. 

 

 

2024-05-13 07:22:32

ఓటు వేసిన ఎమ్మెల్సీ భరత్‌..

  • చిత్తూరు జిల్లా
  • కుప్పం నియోజకవర్గం ఆర్.పేట ప్రాథమిక పాఠశాల ఓటు వేసిన ఎమ్మెల్సీ భరత్‌. 
  • 168 పోలింగ్  కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్
  • కుటుంబం సమేతంగా కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న భరత్
2024-05-13 07:10:39

ఏలూరు జిల్లా పోలింగ్‌ ప్రారంభం..

  • జిల్లాలో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ
  • పోలింగ్ కేంద్రాల వద్ద ఏడు గంటలకే బారులు తీరిన ఓటర్లు
  • ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మెడికల్ క్యాంప్, ఓటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు
  • పోలింగ్ కేంద్రం వద్ద నా ఓటు నా బాధ్యత పేరుతో సెల్ఫీ బోర్డులను ఏర్పాటు..
2024-05-13 07:10:39

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం

  • ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నిలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 
  • పోలింగ్‌ ప్రారంభానికి ముందే పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 
2024-05-13 07:05:14

మాచర్లలో టెన్షన్‌

  • పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్‌
  • రెంటాల గ్రామంలో పోలింగ్‌ ఏజెంట్ల మధ్య ఘర్షణ 
  • పరస్పరం దాడులు చేసుకున్న బూత్‌ ఏజెంట్లు. 
     
2024-05-13 07:01:30

టీడీపీ నేతల దౌర్జన్యం..

  • చంద్రబాబు సొంత గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యం
  • నారావారిపల్లేలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతల దాడి. 
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ ప్రవీణ్‌కుమార్‌పై పచ్చ బ్యాచ్‌ దాడి.
2024-05-13 06:58:31

టీడీపీ నేతల ఓవరాక్షన్‌..

  • టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట.
  • కడప జిల్లా కమలాపురం మండలం కోగంటలో ఉద్రిక్తత. 
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌తో టీడీపీ నేతల వాగ్వాదం.
     
2024-05-13 06:58:31

కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం..

2024-05-13 06:47:09

మాక్‌ పోలింగ్‌ ప్రారంభం

  • మాక్‌ పోలింగ్‌ మొదలైంది. 
  • పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్‌ పోలింగ్‌ ను నిర్వహించారు. 
  • పోలింగ్‌పై బూత్‌ ఏజెంట్స్‌కి పోలింగ్‌ ఆఫీసర్‌ అవగాహన కల్పిస్తున్నారు. 
  • ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్‌ పరిశీలించుకుంటున్నారు.
  • ఉదయం 7 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. 
2024-05-13 06:41:44

నేడే పోలింగ్‌.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం

  • రాష్ట్రంలో ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం 

  • 2,841 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 4.14 కోట్ల మంది ఓటర్లు

  • స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగేలా ఏర్పాట్లు 

  • పార్టీ పోలింగ్‌ ఏజెంట్లు ఉ.5.30కే కేంద్రాలకు చేరాలి 

  • మాక్‌ పోలింగ్‌ ఉ.5.30 గంటల నుంచే నిర్వహణ 

  • ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్‌ 

  • వికలాంగులు, వృద్ధులకు ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

  • ఓటర్లను ఆకర్షించడానికి పలుచోట్ల మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు 

  • అందరూ ఓటేసిరికార్డు స్థాయి పోలింగ్‌ శాతం నమోదు చేయండి 

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా  

2024-05-13 06:27:30
Advertisement
 
Advertisement
Advertisement