తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం! | Actor Suriya donates Rs.6 lakh to dialysis foundation | Sakshi
Sakshi News home page

తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం!

Published Thu, Oct 10 2013 2:36 PM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం!

తమిళనటుడు సూర్య ఆరు లక్షల విరాళం!

ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళనాడు కిడ్ని రిసెర్చ్ (టాంకర్) ఫౌండేషన్ కు ఆరు లక్షల రూపాయలను విరాళమందించారు. మూత్ర పిండాల వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఉపయోగించే డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం సూర్య విరాళాన్ని అందించారు. 
 
తమిళనాడులోని సూలూరులో డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించిన సూర్య వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ... డయాలిసిస్ యంత్రాల కొనుగోలు కోసం 6 లక్షల విరాళం ఇచ్చాను అని తెలిపారు. 
 
ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు టాంకర్ ఫౌండేషన్ సబ్సీడి ప్రాతిపాదికన డయాలిసిస్ పరీక్షల సేవలను అందిస్తోంది. టాంకర్ ఫౌండేషన్ 1993 సంవత్సరంలో ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement